May 11,2023 08:53

హాయ్ ఫ్రెండ్స్‌,

మేము ముగ్గురం స్నేహితులం. గన్నవరం చెంచుకాలనీలో ఉంటాం. మా అమ్మానాన్నలు వంటసామగ్రి అమ్ముతూ ఉంటారు. మేం మా ప్రాంతంలో నిర్వహిస్తున్న ఆదర్శ ట్యూషన్‌ సెంటర్‌కు వెళుతున్నాం. అక్కడ మాకు ఒక టాస్క్‌ ఇచ్చారు. మట్టితో కట్టి చూపించమన్నారు. అప్పుడు మేం ముగ్గురం కలసి మెత్తటి బంకమట్టి, కొన్ని పుల్లలు, రాళ్లు, పువ్వులు సేకరించాం. ఓ థర్మాకోల్‌ షీట్‌ తీసుకుని దానిమీద బంకమట్టితో పెద్ద కొండలా తయారుచేశాం. ఆ కొండపై ఇల్లు.. దాని చుట్టూ అందమైన ప్రహారీ పెట్టాం. ఇంటికి చేరుకోవడానికి మెట్లు తయారుచేశాం. కొండకు రెండు పెద్ద పెద్ద గుహల మాదిరి రంధ్రాలు చేశాం. ఇంటిముందు బావి ఆకారంలో ఓ తొట్టి తయారుచేశాం. అందులో నీళ్లు పోశాం. ఇంటిముందు పూల కుండీ ఏర్పాటుచేశాం. ఇంకా ఇంటి ఆవరణలో కూర్చోనేందుకు కుర్చీ కూడా కట్టాం. బావి పక్కన అందమైన పార్కును కట్టాం. ఇదంతా తయారు చేస్తుంటే భలే సరదాగా అనిపించింది. మా ఇంటి దగ్గర దొరికే పూలతో ఇంటిని అలంకరించాం. ఇది చూసి మా ట్యూషన్‌ టీచర్‌ మమ్మల్ని బాగా మెచ్చుకున్నారు.

clay-house-constructed-by-children


- అసైల్‌, రాణి, అను
చెంచుకాలనీ,
గన్నవరం.