
కల్మషం లేని నవ్వుల నిధి
చిచ్చర పిడుగుల సన్నిధి
విజ్ఞానాల పెన్నిధి
నైతిక విలువల నది
నల్లబల్లపై రాతలు
సుద్దముక్క విన్యాసాలు
మనసులు గెలిచే గురువులు
మానవ వనరుల ఆనవాలు
ఆటపాటల విన్యాసాలు
రెక్కలు విప్పిన ఊహలు
చిగురులు తొడిగే భావాలు
మనిషి జీవన విలువలు
అజ్ఞాన తిమిర సంహారిణి
విజ్ఞాన జీవన వాణి
అనుభవాల ప్రవాహిని
ఆనందాల సుహాసిని
తరగతి గది
చిన్నారుల మది
శాస్త్ర విజ్ఞాన వారధి
సమాజ ప్రగతి సారథి
- మొర్రి గోపి,
88978 82202.