Dec 25,2022 15:43

ప్రజాశక్తి-గణపవరం : జనవరి 2, 3, 4 తేదీల్లో భీమవరంలో జరిగే సిఐడిఓ రాష్ట్ర మహాసభలు జయప్రదం కావాలని కోరుతూ ఆదివారం సిఐటియు మండల కమిటీ ఆధ్వర్యంలో కేశవరం వంతెన సెంటర్లో సిఐటియు రాష్ట్ర మహాసభ గోడపత్రికలను విడుదల చేశారు. ఈ సందర్భంగా మండల కమిటీ కార్యదర్శి పి గోవిందు మాట్లాడుతూ జనవరి రెండో తేదీన జరిగే మహా ప్రదర్శనలో అంగన్వాడి ఆశ మిడ్ డే మీల్స్ కార్మికవర్గంతో పాటు ప్రజానీకం అధిక సంఖ్యలో పాల్గొవాలని అన్నారు. మహాసభకి కేరళ న్యాయశాఖ మంత్రి రాజన్ సిఐటియు ఆల్ ఇండియా నాయకులు ఎమ్మెల్సీలు పాల్గొంటారని చెప్పారు. ప్రదర్శన భీమవరం పాత బస్టాండ్ నుండి కొత్త బస్టాండ్ వరకు కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కరపత్రాలు ద్వారా మహాసభ విశేషాలను ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో పట్నాల శ్రీనివాసరావు సిరికి శ్రీనివాసు ఆదిరెడ్డి కన్నారావు తదితరులు పాల్గొన్నారు.