ప్రజాశక్తి-పరవాడ : . పరవాడ ఫార్మా సిటీలో కోరిఆర్గానిక్ ఫార్మా ప్రమాదంపై సమగ్రమైన విచారణ చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బుధవారం పరవాడ ఫార్మసిటీలో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గని శెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ కొరి ఆర్గానిక్ ఫార్మా పరిశ్రమలో రియాక్టర్ యాంగిల్స్ బిగిస్తుండగా జరిగిన ప్రమాదంలో రాజారావు మృతి చెందాడని వారి కుటుంబానికి కోటి రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని గని శెట్టి డిమాండ్ చేశారు. ప్రమాదంపై ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీ సమగ్ర విచారణ చేయాలని డిమాండ్ చేశారు ఈ పరిశ్రమలో గత రెండుసార్లు ప్రమాదం జరిగిందని ఈ ప్రమాదంతో మూడో ప్రమాదం జరిగిందని భద్రత ప్రమాణాలకు యాజమాన్యాలు పెద్దపీట వేయాలని డిమాండ్ చేశారు భద్రతని యాజమాన్యాలు గాలికి వదిలేస్తున్నాయని లాభాలే పరమార్ధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు ప్రమాదాలు జరిగినప్పుడు అధికారులు , ప్రభుత్వ పెద్దలు హడావిడి చేస్తున్నారే తప్ప శాశ్వతమైన పరిష్కారానికి భద్రతా ప్రమాణాలు పాటించడానికి భద్రత ఆడిట్ నిర్వహించడానికి ప్రభుత్వాలు చర్యలు చేపట్టడం లేదని విమర్శించారు ఇప్పటికైనా ఫార్మా పరిశ్రమల్లో భద్రత ప్రమాణాలపై ఆడిట్ నిర్వహించాలని గని శెట్టి డిమాండ్ చేశారు దీనిపై జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేస్తున్నట్లు గని శెట్టి తెలిపారు ఈ నిరసన కార్యక్రమంలో గండేపల్లి అప్పలరాజు రమణ గొల్లవెల్లి చిట్టిబాబు ముసలి నాయుడు పి శేషు జి పెంటారో జే బాబురావు పి అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు










