Oct 28,2023 14:13

ప్రజాశక్తి-జగదాంబ : సిఐటియు జగదాంబజోన్ ఆధ్వర్యంలో ముగ్ధ షాపింగ్ మాల్ ఎదురుగా సిఐటియు సీనియర్ నాయకులు వై రాజు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ ఏప్రిల్ 10వ తారీఖున కాంచీపురం ముగ్ధ బ్రాంచ్లో పనిచేస్తున్న మురళీకృష్ణ అనే కార్మికుడు చనిపోయారు. అతని ఫ్యామిలీ విశాఖపట్నంలోనే ఉంటున్నారు. ఏమి లేకుండానే పోస్ట్మార్టం చేయించడం, చనిపోయినప్పుడు మురళీకృష్ణకు నోటి నుంచి సొంగలు కారటం పలు అనుమానాలకు త్రోవతీసింది. అయితే గత ఆరు మాసాలుగా ఆ కుటుంబానికి న్యాయం చేస్తామని యాజమాన్యం ఆశ పెడుతూ ఇంతవరకు ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. ఆమె సిఐటియును ఆశ్రయించింది. సిఐటియు ఈ యాజమాన్యంతో మాట్లాడటానికి వెళ్లేటప్పుడు యాజమాన్యం నిరాకరించింది.  దీంతో  ఈరోజు ముగ్ధ షాపింగ్ మాల్ ముందు నిరసన కార్యక్రమం చేపట్టారు. యాజమాన్యం కార్మికులతో చర్చిస్తాం అని చెప్పగా కార్యక్రమం వాయిదా వేశారు. అయితే సదరు యాజమాన్యం ఆ కార్మికునికి ఈఎస్ఐ కట్టకపోవడం కుటుంబానికి అన్యాయం జరిగిందని, చట్ట ప్రకారం అతను వయస్సు రీత్యా చూస్తే 22 లక్షల 50 వేల రూపాయలు రావలసి ఉందని తెలిపారు. ఇంతకాలం యాజమాన్యం 50,000 రూపాయలు వేస్తాo అని చెప్పటం సిగ్గుచేటని సిఐటియు సీనియర్ నాయకులు సుబ్బారావు మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మత్స్యకారుల సంఘం నాయకులు కే చంద్రశేఖరం, సిఐటియు జగదాంబ జోన్ ప్రధాన కార్యదర్శి చంద్రమౌళి, హోటల్ కార్మిక నాయకులు రామారావు, ఎర్రి బాబు బాధిత కుటుంబంతోపాటు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మురళీకృష్ణ కుమార్తె ఆవేదన వ్యక్తం చేశారు.