ప్రజాశక్తి-కంచికచర్ల : సిఐటియు ఎన్టీఆర్ జిల్లా 11వ మహాసభలను పురస్కరించుకొని ఈ నెల 15న విజయవాడలో జరిగే కార్మికుల మహా ప్రదర్శనలో, బహిరంగ సభను జయప్రదం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కోట కళ్యాణ్ పిలుపునిచ్చారు. మహాసభలు జయప్రదం కోరుతూ బుధవారం స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో పారిశుద్ధ్య కార్మికుల తో సమావేశం నిర్వహించారు. ఈ నెల 15న ఉదయం 10 గంటలకు వన్ టౌన్ పంజా సెంటర్ నుండి హిందూ హైస్కూల్ జెండా చెట్టు వరకు కార్మిక ప్రదర్శన ఉంటుందని, అనంతరం హిందూ హైస్కూల్ వద్ద జండా చెట్టు సెంటర్లో జరిగే బహిరంగ సభ జరుగుతుందన్నారు. మహా కార్మిక ప్రదర్శన, బహిరంగ సభలో రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొంటారన్నారు. ఈ సభలో ఆశ, అంగన్వాడి, భవన్, నిర్మాణ, ఉద్యోగులు, ఔట్సోర్సింగ్ ఇతర స్కీం వర్కర్లు పాల్గొని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు కంచికచర్ల మండల కార్యదర్శి బెజ్జం భూషణం తదితరులు పాల్గొన్నారు.










