
ప్రజాశక్తి- పోడూరు : ఉద్యోగ ఉపాధ్యాయుల వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని సిఐటియు జిల్లా కౌన్సిల్ సభ్యులు పిల్లి ప్రసాద్ డిమాండ్ చేశారు. కొత్తపేటలో అంబేద్కర్ విగ్రహం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి ఆయన విగ్రహానికి మెమోరాండం సమర్పించారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతీనెలా ఇచ్చవేతనాలను ఇవ్వకపోవడం చాలా బాధాకరం అన్నారు. నెలల తరబడి ఇవ్వకపోవడం వల్ల ఉద్యోగస్తులు అప్పులు చేయాల్సి ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. వేతనం బకాయిలు వేంటనే చెల్లించాలని కోరారు. లేకుంటే ఉద్యమం చేపట్టాల్సి ఉంటుంది హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ మండల కార్యదర్శి కాకర వెంకటేశ్వర్లు, కౌలు రైతు సంఘం మండల కార్యదర్శి బొంతు శ్రీను, సిఐటియు మండల అధ్యక్షులు బూరాబత్తుల, వెంకట్రారావు సంసేను తదితరులు పాల్గొని మాట్లాడారు.