Aug 30,2023 16:42

ఇస్లామాబాద్‌ :   రహస్యపత్రాల మిస్సింగ్‌ కేసులో ప్రత్యేక కోర్టు బుధవారం పాకిస్తాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ జ్యుడీషియల్‌ రిమాండును సెప్టెంబర్‌ 13 వరకు పొడిగించింది. జడ్జి అబ్దుల్‌ హసంత్‌ జుల్కారినెయిన్‌ ఉత్తర్వులను జారీ చేశారు. అంతర్గత మంత్రిత్వ శాఖ వ్యక్తం చేసిన భద్రతా కారణాల రీత్యా న్యాయశాఖ అనుమతి మేరకు ఈ కేసు విచారణ పంజాబ్‌ ప్రావిన్స్‌లోని అటోక్‌ జిల్లా జైలులో జరిగింది. తోషఖానా అవినీతి కేసులో దోషిగా నిర్థారణకావడంతో ఆగస్ట్‌ ఐదు నుండి ఇమ్రాన్‌ఖాన్‌ అటాక్‌ జిల్లా జైలులోనే ఉన్న సంగతి తెలిసిందే. దీంతో జైలులోనే విచారణ చేపట్టాలని అధికారులు మంగళవారం నిర్ణయించారు.