ప్రజాశక్తి-చీరాల : చీరాల కూరగాయల మార్కెట్ ముఠా వర్కర్స్ సంఘం నాయకులు కూలి రేట్ల పెంపుదల అగ్రిమెంట్ను వెంటనే పరిష్కరించాలని కోరుతూ స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద గురువారం సిఐటియు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా సిఐటియు నాయకులు మాట్లాడుతూ తక్షణమే కూరగాయల మార్కెట్లలో పనిచేస్తున్న కూలీలకు కూలీ రేట్లు పెంచి వారి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డికి వినతిపత్రాన్ని అందజేశారు.










