Dec 16,2022 16:07

ప్రజాశక్తి-గణపవరం : విద్యార్థులకు విద్య అందించడానికి జిల్లాలో 67 విద్యాలయాలు నిర్మించిన విద్యా దాత మాజీ మంత్రి చింతలపాటి సీతారామ వరప్రసాద్ మూర్తి రాజు అని గణపవరం జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ ఎం రఘు అన్నారు. మూర్తి రాజు 103 జయంతి సందర్భంగా కాలేజీలో జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ రఘు మాట్లాడుతూ ఆచార్య వినోబావే చేపట్టిన భూదాన ఉద్యమని స్ఫూర్తిగా తీసుకొని తనకున్న పద్దెనిమిది వందల ఎకరాలను దానం చేసిన మహోన్నత వ్యక్తిని అన్నారు. గాంధీజీ ఆశయాలను ప్రజలకు తెలియ చెప్పడానికి వీలుగా పెద్ద నిండ్ర కొలను గ్రామంలో గాంధీభవన నిర్మాణం చేశారని అన్నారు. కొల్లేరు భూములను సాగులో తెచ్చి కొల్లేరు రాజుగా పేరుపొందిన వ్యక్తిని అన్నారు. ఆయన అడుగుజాడల్లో నేటి విద్యార్థులు నడవాలని అన్నారు. మూర్తి రాజు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కాలేజీ లెక్చరర్ విద్యార్థులు సిబ్బంది పాల్గొన్నారు.