చిట్టిపొట్టి పిల్లలం
నవ్వులతో తుళ్లిపడే మల్లెలం
ఏటిపాటలో వర్షపు నాట్యంలో
చిందేసే బాలలం
రోజుకో చాక్లెట్ పూటకో బిస్కట్
నోరూరించే పల్లరసం
హార్లిక్స్ ఇచ్చే ఉత్సాహం
కార్టూన్ నెట్వర్కే
మా బాలల ప్రపంచం
అచ్చటా ముచ్చటా
మామ్మ తాతయ్యల ఒడిలోనే
కీలుగుర్రమైనా ఏనుగు సవారైనా
నాన్న వీపు మీదే
గోరుముద్దలంటే అమ్మదే రాజ్యం
అల్లరంటే మాదే నిత్యం
బాలలం మేము బాలలం
భావి భారత పౌరులం
దేశాన్ని రక్షించబోయే జవానులం
ప్రపంచానికి చిరునామే మా చిరుప్రాయం
ఎన్. లహరి,
హైదరాబాద్
9885535506










