Nov 06,2023 10:11

ఎల్లలు ఎరుగని వయసు
కల్లాకపటం లేని మనసు
అంతరంగమంతా ఎంతో స్వచ్ఛం
ఆటపాటలే పిల్లల ఆనందం !

గాలిపటాల్లా ఎగురుతూ
బొంగరాల్లా తిరుగుతూ
ఉత్సాహంగా ఉరకలు వేస్తూ
అలసట తెలియని బాల్యం!

మమతల బంధాల అండలో
చెలిమి నవ్వుల తోడుగా
ప్రగతి పథంలో నడుస్తూ
జగతికి వెలుగు నిచ్చే దివ్వెలు!
 

- కె.వి.సుమలత,
గుడివాడ, కృష్ణజిల్లా.