Oct 20,2023 12:06

ప్రజాశక్తి-సోమల : సదుం మండలం చెరుకువారి పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఆరోగ్య కేంద్రం జిల్లా వైద్యాదికారి ప్రభావతి దేవి  ఆకస్మికంగా తనికీ చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో డాక్టర్ శ్రిగిరేశ అధ్వర్యంలో ప్రజలకు అందుతున్న ఆరోగ్య సేవలపై సమీక్ష జరిపారు. అందులో భాగంగా జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాలు మరియు శిబిరాల్లో అందుతున్న సేవలు, రెఫరల్ కేసుల వివరాలు, వారికి అందుతున్న సేవల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో గర్భవతులు నమోదు, హై రిస్కు గర్భవతులకు అందుతున్న సేవల వివరాలు, సురక్షిత కానుపుల కొరకు తీసుకొనవలసిన చర్యలు, వాటిపై వివరాలు తీసుకున్నారు. ఫ్రై డే.-డ్రై డే జరగుతున్న గృహాలు పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా మలేరియా అధికారి శ్రీనివాసులు, డాక్టర్ శిరీష, డాక్టర్ చరణ్, పర్యవేక్షణ సిబ్బంది ఉదయ్ భాస్కర్, నీలకంఠ, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ రషీద్,పాల్గొన్నారు.