Feb 15,2023 15:35

ప్రజాశక్తి-చందర్లపాడు : స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో శ్రీ గురురాజా ఇంగ్లీష్ మీడియం స్కూల్ నంద్యాల, నంద్యాల జిల్లాలో రాష్ట్రస్థాయి అండర్-14 విభాగం త్రోబాల్ పోటీలలో పాల్గొనిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కొండపేట కు చెందిన నర్రా ఇందు 6వ తరగతి, మేడేపల్లి స్ఫూర్తి 6వ తరగతి, చావాల శ్రీలక్ష్మి 7వ తరగతి, కోట విజయ్ కుమార్ 7వ తరగతి, మొదలగు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. అయితే వీరిలో అత్యంత నైపుణ్యం కనబరిచిన విద్యార్థిని నర్రా ఇందు ను జాతీయస్థాయి త్రోబాల్ పోటీలకు ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయులు సీతారాం తెలియజేశారు. ఈ సందర్భంగా పాఠశాల  ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ సనకా రామారావును ఘనంగా సత్కరించడమైనది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చావల రవిబాబు, గ్రామ పెద్దలు కందుల.నాగేశ్వరావు, SMC  చైర్మన్  ఏడుకొండలు, పాఠశాల సిబ్బంది మొదలగు వారు పాల్గొన్నారు.