ప్రజాశక్తి-బుచ్చయ్యపేట : ఈనెల 5న ఛలో ఢిల్లీ కార్యక్రమం జయప్రదం చేయాలని కోరుతూ మండలంలో గల కరకలో గోడ పత్రికను శనివారం రాష్ట్ర అధ్యక్షురాలు గునూరు వరలక్ష్మి ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. అంగన్వాడీ, మధ్యాహ్న భోజన, ఆశ, పారిశుద్ధ్య కార్మికులకు కనీస వేతనం అమలు చేయాలని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా బడ్జెట్ పెంచాలని, పియఫ్, ఈఎస్ఐ సౌకర్యం, ఉద్యోగ భద్రత కల్పించాలన్న డిమాండ్లు పరిష్కరించాలని చేపడుతున్న ఛలో ఢిల్లీ కార్యక్రమం జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. బి.ఉమ, వైవరహాలు, కాసులమ్మ, స్వరూప పాల్గొన్నారు.










