Mar 03,2023 16:48

ప్రజాశక్తి-బుట్టాయిగూడెం : మండలం ఆదివాసి విజ్ఞాన కేంద్రం నందు సిఐటియు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం గిరిజన సంఘం ఆధ్వర్యంలో మండల సదస్సు జరిగింది. ఈ సదస్సులో ముఖ్య వర్తగా వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏ రవి మాట్లాడుతూ కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం ప్రజల పైన భారాలు మోపుతోందని ప్రభుత్వం రైల్వే ఎల్ఐసి స్టీల్ ప్లాంట్ విమానాశ్రయాలను ఇంకా ఇతర ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేయడానికి మోడీ ప్రభుత్వం పూనుకుంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలన్నిటిని ప్రైవేటుపరం చేయడం చేస్తూ కొంతమంది కార్పొరేట్ వ్యక్తులకు కొమ్మ కాసే విధంగా మోడీ ప్రభుత్వం పూనుకుంటుందని అన్నారు. ఈ విధానాలను వ్యతిరేకంగా ఏప్రిల్ 5 చలో ఢిల్లీ కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. అనంతరం సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి మొడియం నాగమణి, గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు తెల్లం రామకృష్ణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మికులు వ్యవసాయ కార్మికుల పట్ల అత్యంత నిర్లక్ష్య దారుణ వ్యవహరిస్తుందని అన్నారు. కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోట్లుగా మార్చి కార్మికుల నడ్డి విరిచే పని చేస్తుందని కార్మికులకు కనీస వేతన అమలు చేయకుండా అడిగితే కార్మికుల పైన యజమానులు దాడులకు పాల్పడుతున్నారు. కార్మిక చట్టాలను పటిష్టంగా అమలు చేయాల్సిన ప్రభుత్వాలే నిమ్మకనీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నాయని అన్నారు ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజన చట్టాలను ఇప్పటికే జీవో నెంబర్ 3 రద్దుచేసి గిరిజనులు అన్యాయం చేసింది అమలు చేయాల్సిన చట్టాలు 1/70 చట్టాన్ని, అటవీ హక్కుల చట్టాలను, పిసా చట్టాలను, నీరుగార్చే విధంగా ప్రభుత్వాలు కొత్త పద్ధతిలో దారులు వెతుక్కుంటున్నారని వాపోయారు. ఈ సమస్యలన్నిటిపై ఏప్రిల్ 5 చలో ఢిల్లీ కార్యక్రమానికి విస్తృత ప్రచారం చేయాలని ప్రజలందరికీ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షురాలు తామా ముత్యాలమ్మ, మండల కార్యదర్శి ఉడత వెంకటేష్, బోరగం.భూ చంద్రం కోవ్వసు దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.