
ప్రజాశక్తి-చల్లపల్లి : నేరాల నియంత్రణకు, శాంతి భద్రతల పరిరక్షణకు తన వంతు కృషి చేస్తానని సిఐ సిహెచ్.నాగప్రసాద్ తెలిపారు. చల్లపల్లి నూతన సిఐగా నియమితులైన సిహెచ్.నాగప్రసాద్ బుధవారం తన కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. ఆయనను చల్లపల్లి, ఘంటసాల, మోపిదేవి ఎస్ఐలు సిహెచ్.చినబాబు, కుడిపూడి శ్రీనివాసు, సిహెచ్.పద్మ, పోలీస్ సిబ్బంది మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలతో సత్కరించి స్వాగతం పలికారు.