Jan 29,2023 22:22
  • ప్రైవేటీకరణతో శ్రీలంక, పాకిస్తాన్‌ల గతే
  • ప్రభుత్వ రంగ పరిరక్షణకు ప్రజలు కదలాలి

ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరిస్తూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం దేశానికి ద్రోహం చేస్తోందని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు సి.హెచ్‌ నరసింగరావు అన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వ్యతిరేక పోరాటం రెండు సంవత్సరాలు పూర్తిచేసుకుని మూడవ ఏడాదిలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఆయన ప్రజాశక్తికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో విచ్చలవిడిగా సాగుతున్న ప్రైవేటీకరణను అడ్డుకోకపోతే దేశానికి శ్రీలంక, పాకిస్తాన్‌ల గతే పడుతుందని హెచ్చరించారు. విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం జరుగుతున్న పోరాటాన్ని దేశభక్తియుత పోరాటంగా అభివర్ణించారు. ఇంటర్యూ వివరాలు క్లుప్తంగా

  • ప్ర: రెండు సంవత్సరాలుగా సాగుతున్న విశాఖ ఉక్కు పోరాటం సాధించినదేమిటి?

జ: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను నూరు శాతం ప్రైవేట్‌కు అమ్మాలని కేంద్ర ప్రభుత్వ ఆర్ధిక క్యాబినెట్‌ సబ్‌కమిటి 2021 జనవరి 27న నిర్ణయించింది. పిఎంఓ ఆఫీస్‌ సలహా మేరకు నీతి ఆయోగ్‌ ఈ నిర్ణయానిు అమలు చెయ్యటానికి ఆనాటి నుండే ఉపక్రమించింది. అప్పటి నుండి ఇప్పటివరకు ఈ నిర్ణయం ఒక్క అంగుళం కూడా ముందుకు వెళ్లలేకపోయిందంటే కార్మికవర్గం చేస్తును పోరాటమే కారణం. పోరాట కమిటీ ఆధ్వర్యంలో కార్మికులు ఐక్యంగా పోరాటం చేస్తుంటే, వారికి విస్తృతంగా ప్రజామద్దతు లభిస్తోంది. అన్ని తరగతులకు చెందిన ప్రజానీకం ఈ పోరాటానికి మద్దతు తెలుపుతునాురు. ప్రత్యక్షంగా కార్యాచఱకు కదులుతునాురు. ఆంధ్రుల హక్కును కాపాడుకుంటామని నినదిస్తున్నారు. అందుకే దేశంలో నేడు అనేక చోట్ల జరుగుతున్న కార్మిక ఉద్యమాల్లో విశాఖ పోరాటానికి ధీటు మరొకటి లేదని చెప్పవచ్చు. అందుకే ఈ పోరాటానికి దేశవ్యాపిత ప్రాముఖ్యత ఏర్పడింది.పోరాటం ప్రారంభమై జనవరి 30 నాటికి 2 సంవత్సరాలు పూర్తి అవుతుంది. ఇంత సుదీర్ఘంంగా పోరాటం జరుగుతున్నా కార్మికవర్గం ఐక్యంగా నిలవడం, వారికి ప్రజా మద్దతు రోజురోజుకి పెరుగుతుండటం విశేషం. బిజెపి మినహా రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలను ఒకే వేదికపైకి తీసుకువచ్చిన ఘనత కూడా ఈ పోరాటానిదే.

  • ప్ర: రెండుళ్ల పాటు పోరాటాన్ని ఎలా నిర్వహించారు?

జ: ప్రతి రోజు స్టీల్‌ ప్లాంట్‌ జాతీయ రహదారి పక్కన ఉను కూర్మనుపాలెం వద్ద ఒక రిలే నిరాహార దీక్షా శిబిరం, విశాఖ నగరం నడిబడ్డున ఉన్న గాంధీజీ విగ్రహం వద్ద మరో రిలే నిరాహారదీక్షా శిభిరం కొనసాగుతోంది. రిలే నిరాహార దీక్షలతో పాటు మరో 50 కార్యక్రమాలు పైగా జరిగాయి. . విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ లోపల, బయట కూడా భారీ కార్యక్రమాలు నిర్వహించాము . బిజెపి మినహా అన్ని రాజకీయ పార్టీలు ఒకే వేదికపైకి వచ్చాయి. విశాఖ స్టీల్‌ గేట్‌ వద్ద జరిగిన సభలో సుమారు 20 వేల మంది కార్మికులు, ప్రజలు పాల్గనాురు. జనసేన స్వతంత్రంగా ఒక భారీ సభ నిర్వహించింది. కేంద్ర, ప్రభుత్వ నిర్ణయానిు వీరంతా తీవ్రంగా విమర్శించారు. విశాఖ స్టీల్‌ అమ్మకాన్ని ఆపాలని డిమాండ్‌ చేశారు. అఖిలభారత ట్రేడ్‌ యూనియన్‌ నాయకులు, బిఎంఎస్‌ తో సహా ప్రత్యక్షంగా పాల్గని ఉద్యమానికి మద్దతునిచ్చారు. 10 వేల మందితో 10 కిలో మీటర్లు స్టీల్‌ ప్లాంట్‌ వద్ద భారీ మానవహారం జయప్రదంగా జరిగింది. విద్యార్ధి, యువత 3 సార్లు 5 కే రన్‌, బీచ్‌ వాక్‌ లు వేలాది మందితో నిర్వహించారు. జాతీయ కిసాన్‌ మోర్చా నాయకులు విశాఖ బీచ్‌లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో అశోక్‌ ధావ్‌లే, రాజేష్‌ తికాయత్‌ తో సహా పలువురు పాల్గనివిశాఖ స్టీల్‌ పోరాటానికి మద్దతు నిచ్చారు. నిరంతరంగా ఈ పోరాటాలు సాగటానికి పర్మినెంట్‌ కార్మికులు, కాంట్రాక్ట్‌ కార్మికులు, అధికారుల తో ''విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ'' ఏర్పాటు కావడమే ప్రధాన కారణం. ''విశాఖ ఉక్కును అమ్మనివ్వం'' అనే ఏకైక నినాదంతో ఈ ఉద్యమం నేటికీ కొనసాగుతున్నది.ఐక్య ఉద్యమాలతోనే ప్రభుత్వ విధానాలను అడ్డుకోగలమని స్టీల్‌ కార్మికులు రుజువు చేశారు.

  • ప్ర: ప్రజలు ఇంతగా స్పందించడానికి కారణం ఏమిటి?

తెలుగు ప్రజలు పోరాడి సాధించుకున్న భారీ పరిశ్రమ ఇది. ''విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు'' నినాదంతో 1966 నవంబర్‌లో 32 మంది ప్రాణాలు త్యాగం చేశారు. వారి ప్రాణ త్యాగంతోనే ఈ పరిశ్రమ ఏర్పాటైంది. విశాఖ జిల్లాలోని పెదగంట్యాడ ప్రాంతంలో 68 గ్రామాల్లో రైతులు 22 వేల ఎకరాలు అతిచౌకగా విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు ఇచ్చారు. 16 వేల మంది నిర్వాసితుల్లో నేటికి 8 వేల మందికి ఉపాధి కూడా రాలేదు. ఆనాడు కేంద్ర కాంగ్రెస్‌ ప్రభుత్వం మొండిగా వ్యవహరించినా కేంద్ర ప్రభుత్వ మెడలు వంచేలా పోరాటం సాగింది. 1978 జనతాపార్టీ హయాంలో వెయ్యి కోట్ల కేంద్ర బడ్జెట్‌ నుంచి విడుదల చెయ్యటంతో విశాఖ స్టీల్‌ నిర్మాణం వేగంగా సాగింది. కేంద్ర ప్రభుత్వం నిధులు పూర్తిగా సమకూర్చకపోయినా అప్పులతో 3.2 మిలియన్‌ టన్నుల సామర్ధ్యం గల స్టీల్‌ ప్లాంట్‌ను 1990 లో విపి సింగ్‌ జాతికి అంకితం చేశారు. ఆనాటి నుంచి నిధులు ఒక్క రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వం సమకూర్చకపోయినా సొంత లాభాలతోనే విశాఖ స్టీల్‌ రూ.12 వేల కోట్లు అదనంగా ఖర్చు పెట్టి నేడు 7.3 టన్నుల సామార్ధ్యానికి ఎదిగింది. 2021-2022 వార్షిక టర్నోవర్‌ రూ.20 వేల కోట్లు సాధించింది. ఇదే సంవత్సరం నికర లాభం రూ.945 కోట్లు ఆంధ్ర రాష్ట్ర పరిశ్రమలకే విశాఖ స్టీల్‌ మణిహారం. ఈ పరిశ్రమ ప్రతిదశలోనూ ప్రజల, కార్మికుల త్యాగాలు ఉన్నాయి. ఇటువంటి భారీ పరిశ్రమను విదేశీ పోస్కో కంపెనీకి కారు చౌకగా కట్టబెట్టాలనుకోవడం దేశద్రోహాం.

  • ప్ర : ప్లాంటు పరిరక్షణకు మార్గాలున్నాయా?

జ: విశాఖ స్టీల్‌ను రక్షించుకోవటానికి సిఐటియు 3 ముఖ్య పరిష్కారాలను సూచిస్తోంది. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ఏకైక ముఖ్య సమస్య సొంత గనులు లేకపోవడం. దీనివల్ల ప్రతి సంవత్సరం సుమారు రెండు వేల కోట్లు అదనంగా విశాఖ స్టీల్‌ ఖర్చు చేయవల్సి వస్తోంది. దేశంలోని అన్ని ప్రభుత్వ రంగ, ప్రైవేట్‌ స్టీల్‌ ప్లాంట్లకు సొంత గనులున్నాయి. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ కుసొంత గనులు ఎందుకివ్వరు ? విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను బలహీన పర్చాలనే దురుద్దేశంతో కేంద్ర ప్రభుత్వం నేటికి ముఖ్యంగా ఇనుప గనులు కేటాయించడలేదు. తక్షణమే సొంత గనిని మంజూరు చేయాలి. రెండవది స్టీల్‌ ప్లాంట్‌ కును రుణాలు సుమారు రూ.30 వేల కోట్లు రద్దుచెయ్యడం. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ఇప్పటి వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.58 వేల కోట్లు పనుులు, డివిడెండ్ల పేరుతో చెల్లించింది. విశాఖ స్టీల్‌ ప్రైవేటీకరించకుండా ప్రభుత్వ రంగంలోనే నడిపితే ప్రతి సంవత్సరం ప్రభుత్వానికి వేల కోట్లు పనుుల రూపంలోనే వస్తాయి. అప్పులు ఎగ్టొట్టిన బడా పెట్టుబడిదారులకు కేంద్ర ప్రభుత్వం రూ.10 లక్షల కోట్లకుపైగా రుణమాఫీ చేసింది. అదే విధంగా స్టీల్‌ ప్లాంటు అప్పులను మాఫీ చేయాలి. మూడవది ప్లాంటును పూర్తి సామర్ధ్యంతో నడపడం.కంద్ర ప్రభుత్వం కావాలని స్టీల్‌ ధరలు బాగా ఉను సమయంతో సహా విశాఖ స్టీల్‌ ఉత్పత్తినిభారీగా తగ్గించింది. స్టీల్‌ ప్లాంట్‌లో కీలకమైన బ్లాస్ట్‌ ఫరుేష్‌ - 3 సంవత్సరం నుంచి మూసివేసింది. వివిధ విభాగాల్లో ఉత్పత్తినిభారీగా తగ్గించింది. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ నూరు శాతం సామర్ధ్యంతో నడపాలి.

  • ప్ర: కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ వైఖరి ఎలా ఉంది.?

జ: రెండేళ్లుగా పెద్ద ఎత్తున పోరాటం సాగుతునాు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం స్పందించడం లేదు. పైగా స్వాతంత్య్రానంరతం దేశ ఆర్ధిక, సామాజిక అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన ప్రభుత్వ రంగానిు పూర్తిగా అమ్మేస్తాం. లేదామూసేస్తాం అనే తప్పుడు వైఖరి తీసుకుంది. రైళ్ళు, విద్యుత్‌, పెట్రోలియం తో సహా అనే కీలక రంగాలు రకరకాల పద్దతుల్లో అమ్మకానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధం చేస్తునుది. బిజేపి ప్రభుత్వం విదేశీ బహుళజాతి సంస్థలకుఅమ్ముడుపోయి దేశంలోనిభూములు, గనులు, సముద్ర తీరం, భారీ పరిశ్రమలతో సహా దేశ సంపదను విదేశాలకుకట్టబెడుతోంది. ఇది భారతదేశానికి తీవ్ర ద్రోహం చేయడమే. ఈ రంగాలు ప్రైవేటు అయితే ప్రజలపై విపరీతమైన భారాలు పడతాయి. విద్యుత్‌, రైల్వే చార్జీలు అనేక రెట్లు పెరుగుతాయి. శ్రీలంక, పాకిస్థాన్‌ ల గతి భారతదేశానికి దాపురించకతప్పదు. అందుకే కార్మికులు పెద్ద ఎత్తున కేంద్ర నిర్ఠణయాలను వ్యతిరేకిస్తునాురు. మహారాష్ట్రలో విద్యుత్‌ పంపిణి ప్రైవేట్‌కు వ్యతిరేకంగా జనవరి 4న ఆ రాష్ట్రంలో జరిగిన భారీ సమ్మె దీనికి ఉదాహరణ. భారత దేశం నేటికి వ్యవసాయ దేశం వ్యవసాయానిు కూడా కార్పొరేట్లకి కట్టబెట్టాలని బిజేపి కుట్ర చేస్తునుది. ఈ కుట్రకు వ్యతిరేకంగా పోరాటం చేయడమే మార్గం. అందుకే విశాఖ ఉక్కు పరిరక్షణ ఉద్యమం కేంద్రంలోనిబిజెపి ప్రభుత్వానికి వ్యతిరేక పోరాటం. . బిజేపి విధానాలకు వ్యతిరేకంగా జరుగుతును ఈ పోరాటానికి అనిు తరగతులు, రంగాల ప్రజల విస్తృత మద్దతు కోరుతునాుం. ఆ తరహా విశాల మద్దతుతో జరిగే ఐక్క పోరాటాలతోనే బిజేపి విధానాలను తిప్పికొట్టగలం.