- జనవరి 5న తుది ఓటర్ల జాబితా ప్రచురణ
- పురుష ఓటర్లు 1,96,49,849మంది
- మహిళా ఓటర్లు 2,01,32,271మంది
- థర్డ్ జెండర్ ఓటర్లు 3,858మంది
- గతేడాదితో పోలిస్తే తగ్గిన 8,82,366 ఓటర్లు
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : రాష్ట్ర ఎన్నికల ముసాయిదా ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేష్‌కుమార్ మీనా బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా సచివాలయంలోని ఆయన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. నవంబరు 9నాటికి రాష్ట్రంలో 3,98,54,093 మంది ఓటర్లు ఉన్నారని, వీరిలో పురుష ఓటర్లు 1,96,49,849మంది కాగా, మహిళా ఓటర్లు 2,01,32,271మంది, థర్డ్ జెండర్ ఓటర్లు 3,858 మంది ఓటర్లు ఉన్నారన్నారు. వీరితో పాటు సర్వీసు ఎలక్టోరల్స్ పురుషులు 65,765మంది, మహిళలు2,350మంది ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. సర్వీస్ ఎలక్టోరల్స్, జనరల్ ఎలక్టోరల్స్‌తో కలిపి పురుష ఓటర్లు 1,97,15,614మంది, మహిళా ఓటర్లు 2,01,34,621మంది, థర్డ్ జెండర్ ఓటర్లు 3,858మందితో కలిపి మొత్తం 3,98,54,093మంది ఓటర్లు ఉన్నట్లు ముకేష్‌కుమార్ మీనా వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 18-19 ఏళ్ల వయస్సున్న ఓటర్ల సంఖ్య 68,115మంది అని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిద కారణాలతో 10,52,326మంది ఓటర్లను జాబితానుంచి ఎన్నికల కమిషన్ తొలగించిందన్నారు. ఇందులో డూప్లికేట్ ఓటర్లు, మృతులు, ఒకేపేరుతో వేర్వేరు చోట్ల నమోదైన ఓటర్లును ప్రత్యేక సాప్ట్‌వేర్ ద్వారా నకిలీ ఓటర్లను పేర్లను తొలగించినట్లు ఆయన పేర్కొన్నారు. గత ఏడాది ఓటర్ల జాబితాతో పోలిస్తే 8,82,366 మంది ఓటర్లు తగ్గారని తెలిపారు. 2023 జనవరి 5న తుది ఓటర్ల .జాబితా ప్రచురణ ఉంటుందని, డిసెంబరు 8వరకు క్లెమ్స్, అభ్యంతరాలను స్వీకరించడం జరుగుతుందన్నారు. నిరాశ్రయులకు ఓటరు కార్డు ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించిందన్నారు. 2023 జనవరి నాటికి 18 ఏళ్లు నిండే ప్రతి ఒక్కరసోటర్లుగా నమోదయ్యేందుకు ముందుగా దరకాస్తు కూడా చేసుకోవచ్చన్నారు.
- ఓటరు కార్డుతో ఆధార్ అనుసంధానం తప్పనిసరి కాదు
ఓటరు కార్డుతో ఆధార్ అనుసంధానం తప్పని సరిచేయడం లేదని, అయితే ఓటరు కార్డుతో ఆధార్ అనుసంధానం ప్రక్రియ 60శాతం మేర పూర్తయ్యిందని సిఇఓ ముకేష్‌కుమార్ మీనా తెలిపారు. ఓటరు నమోదు కోసం వాలంటీర్ల సేవలను ఉపయోగించుకోవద్దని ఇప్పటికే కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. పట్టభద్రులఎమ్మెల్సీ, ఉపాధ్యాయ ఓటర్ల నమోదు ప్రక్రియపై ఫిర్యాదులు వచ్చాయని, వీటిపై ఈనెల 19వ తేదీ వరకు విచారణ చేపడుతున్నట్లు సిఇఓ తెలిపారు. తప్పుడు ధృవీకరణ ఇచ్చే అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. ఎలాంటి గుర్తింపు లేకపోయినా విచారణ అనంతరం వారికి ఓటరు కార్డు జారీ చేస్తామని ముకేష్‌కుమార్ మీనా తెలిపారు. అత్యధికంగా ఓటర్లు ఉన్న జిల్లాలుగా అనంతపురం 19,13,813 ఓటర్లు, కర్నూలులో 19,13,65 ఓటర్లు ఉండగా, అత్యల్పంగా ఓటర్లు ఉన్న జిల్లాగా అల్లూరి సీతారామరాజు,7,15,990 మంది ఓటర్లు, పార్వతీపురం మన్యం జిల్లాలో 7,70,175మంది ఓటర్లు ఉన్నారు.
- జిల్లాల వారీగా ఓటర్ల వివరాలు:
.జిల్లా పేరు పురుష ఓటర్లు మహిళా ఓటర్లు థర్డ్‌జెండర్స్ మొత్తంఓటర్లు
శ్రీకాకుళం 920674 911075 203 18,31,952
విజయనగరం 757385 766523 102 15,24,010
పార్వతీపురం మన్యం 378105 392010 60 7.70,175
అల్లూరిసీతారామరాజు 347075 368885 30 7,15.990
విశాఖ పట్టణం 945706 938604 128 18,84,438
అనకాపల్లి 624865 647972 58 12,72,895
కాకినాడ 788115 801775 235 15,90,125
కోనసీమ 741743 743820 22 14,85,585
తూర్పుగోదావరి 757032 784885 119 15,42,036
పశ్చిమ గోదావరి 716091 739991 99 14,56,181
ఏలూరు 780159 806462 112 15,86,733
కృష్ణ 729501 763479 90 14,93,070
ఎన్‌టిఆర్ 811932 835883 148 16,47,963
గుంటూరు 837548 884623 235 17,22,406
బాపట్ల 621936 644100 74 12,66,110
పల్నాడు 833510 859741 214 16,93,465
ప్రకాశం 890934 887816 113 17,78,863
నెల్లూరు 933104 965779 247 18,99,130
కర్నూలు 953163 960199 292 19,13,654
నంద్యాల 660511 674864 278 13,35,549
అనంతపురం 956779 956824 210 19,13,813
శ్రీ సత్యసాయి 671895 665591 63 13,37,549
వైఎస్‌ఆర్ 780715 802373 254 15,83,342
అన్నమయ్య 667704 680520 142 13,48,366
చిత్తూరు 760927 768912 113 15,29,952
తిరుపతి 848505 881915 217 17,30,637
19715614 20134621 3858 3,98,54,093










