Jun 28,2023 15:55

ప్రజాశక్తి-చీరాల : ఏక్ భారత్.. శ్రేష్ఠ భారత్ లో భాగంగా జాతీయస్థాయిలో జరిగిన ఎన్సిసి క్యాంపులో చీరాల ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన నలుగురు విద్యార్థులు పాల్గొని సత్తా చాటారు.  వడ్లమూడి లోని శ్రీ విజ్ఞాన్ యూనివర్సిటీలో జరిగిన ఈ ఎన్సిసి శిబిరంలో దేశంలోని 17 డైరెక్టరేట్ల నుంచి  600 పైగా క్యాడెట్లు పాల్గొన్నారు. సిఈసి నుంచి జి.శివ నాగబాబు, సాయి త్రినాథ్, పి. గ్రేస్ బ్యులా, దివ్య శ్రీలు  ప్రాతినిధ్యం వహించారు. బాపట్ల, పల్నాడు, గుంటూరు జిల్లాల పరిధిలోని 23 ఆంధ్రా బెటాలియన్ నుంచి ఇద్దరు బాలికలు ప్రాతినిధ్యం వహించగా వారు ఇద్దరు సిఇసి విద్యార్థులే కావటం గమనార్హం. అదేవిధంగా ఒకే కాలేజ్ నుంచి నలుగురు ఈ క్యాంపులో పాల్గొనటం మరో విశేషం. ఈ సందర్భంగా బుధవారం కళాశాలలో జరిగిన అభినందన కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ పి. రవికుమార్ మాట్లాడుతూ దేశం లోని అన్ని రాష్ట్రాలు,  కేంద్రపాలిత ప్రాంతాల  విద్యార్థులు పాల్గొన్న ఈ శిబిరంలో తమ కళాశాల నుంచి నలుగురు విద్యార్థులు పాల్గొనడం హర్షణీయమన్నారు. అందులో బెటాలియన్ నుంచి పాల్గొన్న ఇద్దరు బాలికలు తమ కళాశాలకు చెందిన విద్యార్థులు కావడం మరింత గర్వకారణం అన్నారు.యాజమాన్యం సహకారంతో ఇంజనీరింగ్ కాలేజీలో ఎన్సిసినీ విజయవంతంగా నడుపుతున్నమన్నారు. ప్రతి సంవత్సరం తమ కళాశాల నుంచి అనేకమంది విద్యార్థినీ విద్యార్థులు వివిధ క్యాంపుల్లో పాల్గొంటూ ప్రతిభ చూపుతున్నారన్నారు. ఈ క్యాంపులో కూడా టాంగ్ ఆఫ్ వార్ లో 23 ఆంధ్ర బెటాలియన్ ప్రదమస్థానం సాధించిందని అందులో ఇద్దరు తమ విద్యార్థులు ఉన్నారన్నారు. భవిష్యత్తులోనూ ఇదే విధంగా కళాశాలలో ఎన్సీసీని అభివృద్ధి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్సిసి ఆఫీసర్ హరీష్, సి ఎస్ఈ సి హెచ్ ఓ డి డాక్టర్ సౌజన్య, సూర్యనారాయణ పాల్గొన్నారు.