న్యూఢిల్లీ : ఎల్‌ఇడి టివిలు, మొబైల్ ఫోన్‌లు, డిజిటల్ కెమెరాలు, విద్యుత్ కార్లపై మోడీ ప్రభుత్వం పన్నులను తగ్గించింది. ఏప్రిల్ 1 నుండి వీటి ధరలు భారీగా తగ్గనున్నాయి. ప్రజలకు అవసరమైన నూనె, గ్యాస్ ధరలు మాత్రం కొండెక్కుతున్నాయి. గోధుమలు, బియ్యం, పప్పులు, కూరగాయాలు, ఔషధాల వంటి నిత్యావసరాలు మధ్యతరగతి బడ్జెట్‌కు అందడం కూడా కష్టతరమౌతోంది. ఇఎంఐ, పెట్రోల్ ధరలు కూడా ఆకాశాన్ని తాకాయి. 2022 ప్రపంచ ఆకలి సూచిలో 121 దేశాలకు గాను భారత్ 107 స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. గతేడాది కన్నా ఆరుస్థానాల దిగువకు పడిపోయిన దేశంలో ప్రస్తుత పరిస్థితి ఇది. ఈ పరిస్థితిని వివరిస్తూ జాతీయ మీడియాలో ఓ కార్టూన్ ప్రచురితమైంది. ''ఈ పన్నుల తగ్గింపుతో సామాన్య ప్రజలకు ఒరిగేదేముంది'' అని ఆ కార్టూన్ నిలదీస్తోంది. జాతీయాదాయంలో 56 శాతం కేవలం పది శాతం మంది గుప్పిట్లోకి వెళుతోన్న సమయంలో... కార్పొరేట్ సంస్థలకు లాభాలు చేకూర్చేలా మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తోంది.










