ప్రజాశక్తి-అద్దంకి : మండలంలోని బొమ్మనంపాడు గ్రామ సమీపంలోని ముప్పవరం రోడ్డుకు వెళ్లే పొలాలలో గత గత వారం రోజుల నుండి కేరళ రిజిస్ట్రేషన్ కలిగిన కారు నిలిపి ఉంది. గ్రామస్తులు గుర్తు తెలియని కారు ఇక్కడే ఉండడంతో అనుమానం వచ్చి స్థానిక పోలీస్ స్టేషన్కు సమాచారం అందించారు. బుధవారం కారు నిలిపి ఉన్న ప్రాంతానికి వెళ్లగా కారు డిక్కీ ఓపెన్ చేయగా కింటానర గంజాయి ప్యాకెట్ లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.










