- గణపవరం పోటోవెలుగు సిబ్బందికి వినతిపత్రం అందచేస్తున్నయానమేటర్లు
ప్రజాశక్తి-గణపవరం : డ్వాక్రా యానిమేటర్ల ఉద్యోగ భద్రత హరించే కాలపరిమితి సర్కులర్ ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ గణపవరం మండల కమిటీ ఆధ్వర్యంలో శనివారం డ్వాక్రా యానిమేటర్లు శనివారం స్థానిక వెలుగు కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న యానిమేటర్ల సంఘ జిల్లా కార్యదర్శి అజయ్ కుమారి మాట్లాడుతూ ప్రభుత్వం రోజురోజుకు పని భారం పెంచుకుంటూ పోతుందని అన్నారు. వారికి శ్రమకు తగ్గ వేతనాలు ఇవ్వడం లేదని అన్నారు. కొన్ని సందర్భాల్లో యానిమేటర్లు తన సొంత సొమ్ములు నష్టపోవలసిన సందర్భాలు కలుగుతున్నాయని అన్నారు. ప్రభుత్వం యానిమేటర్ల వ్యతిరేక విధానాలు మానుకోకపోతే రాబోయే కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని అన్నారు. అనంతరం వెలుగు కార్యాలయం సిబ్బందికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి పి గోవిందు యానిమేటర్ల మండల కమిటీ అధ్యక్షురాలు తోట పద్మావతి యానిమేటర్లు పాల్గొన్నారు.










