ప్రజాశక్తి-పరవాడ : డిసెంబర్ 18,19 తేదీల్లో పరవాడ మండలంలో జరుగుతున్న సిఐటియు 12వ జిల్లా మహసభలను జయప్రదం చేయాలని సిఐటియు మండల కార్యదర్శి ఐకెపి యునియన్ జిల్లా అద్యక్షులు కె సూరిబాబు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రదాన కార్యదర్శి డివెంకన్న పిలుపునిచ్చారు. బుధవారం దేవరాపల్లిలో మహసభలు పోస్టర్ ను విడుదల చేసిన అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు. ఈమహసభల్లో అశ అంగన్వాడీ విఆర్ఎ విద్యుత్ కోఆపరెటవ్ సంస్థలు బలోపేతం, మద్యాహ్నం బోజన కార్మికులు విఓఎలు, మొత్తం స్కీం వర్కర్లు సమస్యలుతో పాటు అసంఘటిత కార్మికులు సమస్యలు పరిష్కారం కాంట్రాక్టు ఆవుట్ స్టోర్సింగ్ ఉద్యోగులు, ఉద్యోగ పరిరక్షణ కనీస వేతనాలు అమలుచేయాలని డిమాండ్ చేశారు. గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని రెండు వందలు రోజులు పని 600 కూలి ఇవ్వాలని విద్యావైద్యం ప్రవేటికరణ ప్రభుత్వ రంగస్థలు పబ్లిక్ సెక్టార్లు ప్రవేటికరణ, వంటి కీలకమైన అంశాలపై చర్చించడం జరుగుతుందని తెలిపారు. దేశంలో కార్పోరేట్ సంస్థలు పెచ్చిరిల్లు పోతున్నాయని దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రజలను కూడగట్టి అందోళన చేయవలసిన అవసరం ఉందన్నారు అధిక ధరలతో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. జిల్లాలోని సంఘిటిత రంగం పెరుతుందని తెలిపారు.వ్వవసాయ రంగంలో మార్పులు రైతులు పండిస్తున్న పంటలకు గిట్టుబాటు ధరలు లేక పోవడం గ్రామాల్లో బిల్డింగ్ వర్క్ర్లుగాను ఆటో ముఠా రిక్షా కార్మికులు, సంఖ్య పెరుతుందని దీనికి అనుగుణంగా భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళనలు చేయాలని ఈమహసహల్లో చర్చించి భవిష్యత్ మూడు సంవత్సరాలు ఉద్యమాలకు రూపకల్పన చేయడం జరుగుతుందని తెలిపారు. దీనికి ప్రతి ఓక్కరు సహయ సహకాలు అందించి మహసభలు జయప్రదం చేయాలని కోరారు. ఈకార్యక్రమంలో స్రుజన అప్పారావు లక్ష్మీ లీలా వరలక్ష్మి తో పాటు అదిక సంఖ్యలో కార్మికులు పాల్గోన్నారు.










