Dec 22,2022 08:40

ప్రజాశక్తి, ఎంవిపి కాలనీ : భవన నిర్మాణ కార్మికుడు మృతి చెందిన సంఘటణ త్రీటౌన్ పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. సి.ఐ. కె.రామారావు తెలిపిన వివరాల ప్రకారం చోడవరం, చీడికాడ గ్రామానికి చెందిన కె.అప్పారావు (44) మహారాణిపేటలో భార్య పిల్లలతో భవన నిర్మాణ కార్మికుడుగా జీవనం కొనసాగిస్తున్నాడు. ఇదిలా ఉండగా ఈస్ట్ పాయింట్ కాలనీలో కొత్తగా నిర్మాణం చేపడుతున్న భవన రెండవ అంతస్థు పరంజ్ మీద నుండి  ప్రమాదవశాత్తు  పడిపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. దీంతో చికిత్స నిమిత్తం కే.జీ.హెచ్.కు తరలించారు. అప్పటికే అప్పారావు మృతి చెందినట్లు డాక్టర్లు దృవీకరించారు. దీంతో త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.