Nov 17,2022 11:35

ప్రజాశక్తి -బుచ్చయ్యపేట : మండల కేంద్రం బుచ్చియ్యపేట సర్పంచ్ సుంకర సూరిబాబు ఆకస్మికంగా మృతి చెందారు. బుధవారం రాత్రి తన వ్యవసాయ పొలం వద్ద మట్టి లోడు వేయిస్తుండగా తనపై ట్రాక్టర్ బోల్తా పడడంతో తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. సూరిబాబు మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సూరిబాబు మృతిని ప్రజలు జీవించుకోలేక పోతున్నారు.నిత్యం ప్రజలతో సత్సంబంధాలు కలిగిన వ్యక్తి ఎవరికి ఏఆపద వచ్చినా వారికి అండగా ఉండే సూరిబాబు చిన్న వయసులోనే మృతి చెందడంతో కుటుంబ సభ్యులతో పాటు ప్రజలు కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్నారు. మృతదేహాన్ని అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి పోస్టుమార్టంకి తరలించారు. టిడిపి జిల్లా అధ్యక్షుడు బుద్ధ నాగ జగదీష్, మాజీ ఎమ్మెల్యే కేఎస్ఎన్ రాజు, ఇన్చార్జి బత్తుల తాతయ్య బాబు, జడ్పిటిసి దొండా రాంబాబు,పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు, వివిధ పార్టీల నాయకులు భౌతిక కాయాన్ని సందర్శించి నివాళి అర్పించారు.