Jun 09,2023 15:20
  • బహుజన సమాజ్ పార్టీ నాయకుల ఆరోపణ  

ప్రజాశక్తి-వేటపాలెం : మండల పరిధిలోని దేశాయిపేట, నాయనపల్లి బోర్లపాలెంలో సుమారు అర ఎకరం సొనపోరంబోకు స్థలాన్ని స్వాధీనం చేసుకుని గుంటూరు మాధవరావు(మధు) విక్రయించే ప్రయత్నం చేస్తున్నారు. సదరు స్థలంలో దళిత వర్గానికి చెందిన వారు పశువుల పాకలు ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. దాదాపుగా గత నలభై సంవత్సరాలుగా ఇక్కడ నివసిస్తూ ఈ భూమిపై ఆధారపడి జీవిస్తున్నాం. ఈ నేపథ్యంలో గుంటూరు మాధవరావు(మధు) అనే వ్యక్తి రెవిన్యూ పోలీసులు, రౌడీల అండతో ఈ భూమిని స్వాధీనం చేసుకోవాలనే తలంపుతో ఎస్సీ మాదిగలమైన మాపై దౌర్జన్యంకు పాల్పడి మా పశువుల పాకలను సైతం కూల దోయడం జరిగింది. ఇతనికి లెక్కలేని ఎకరాల భూమి ఉంది. మమ్ములను కులం పేరుతో దూషిస్తూ నానా దుర్భాషలు ఆడుతున్నాడు. ఈ సమస్యపై జిల్లాస్థాయి అధికారులకు ఫిర్యాదులు చేసినా ఫలితం సూన్యం అని వాపోయారు. బహుజన సమాజ్ పార్టీ నాయకులు గొర్రెపాటి రవికుమార్, భగత్ సింగ్, షేక్ షరీఫ్ తదితర నాయకులు మాట్లాడుతూ, ఎన్నో ఏళ్లుగా ఇక్కడ నివసిస్తూ ఉన్న మా దళిత వర్గాలపై గుంటూరు మాధవరావు ఈ విధంగా అసభ్యకరమైన పదజాలంతో మాట్లాడటం గర్హిస్తున్నాము. సుప్రీంకోర్టు సైతం ప్రభుత్వ స్థలాలలో నివాసం ఉంటున్నారని తెలిపారు.