- ఎందుకు అమర్చారో కండక్టర్కు కూడా తెలియని వైనం..
ప్రజాశక్తి-వెదురుకుప్పం (చిత్తూరు జిల్లా) : బస్సులో కండక్టర్ సీటు ముందర భాగంలో ఒక డబ్బాను అమర్చి అందుకు హుండి టైపులో హోల్డ్ పెట్టి అమర్చారు. ఆర్టీసీ వారు. ఈ సంఘటన చిత్తూరు జిల్లా, గంగాధర నెల్లూరు నియోజకవర్గం పరిధిలో, వెదురుకుప్పం మండలం తిరుపతి పల్లిపట్టు Ap03Z 5176 నంబరు గల బస్సుకు ఆదివారం కొత్తగా దర్శనమిచ్చింది. ఆ బస్సులో ప్రయాణం చేస్తున్న ప్రయాణికులు ఎందుకు ఈ డబ్బాను అమర్చారు , మేము ఏమైనా కానుకలు ఇందులో వేయాలా అని ప్రశ్నించారు. ఏమో నాకు తెలియదు . మీరు ప్రయాణం చేస్తున్న టికెట్ వెనుక మీ ఫోన్ నెంబర్ రాసి అందులో వేయాలి అని డ్రైవర్ చెబుతున్నారని కండక్టర్ ప్రయాణికులకు సమాధానం ఇచ్చింది. దీని అర్థం ఏమిటో ఆర్టీసీ వారికి ఎరుక అని ప్రయాణికులు అంటున్నారు.










