Sep 20,2023 10:05

ప్రజాశక్తి-ఏలూరు స్పోర్ట్స్ : ఏలూరు సర్వజన ఆస్పత్రిలో పసికందు మృతదేహం వాహనాల మధ్య పడవేసి ఉన్న ఘటన చేసుకుంది. ఏలూరు నగరంలోని సర్వజన ఆస్పత్రిలో బ్లడ్ బ్యాంక్ ఉంది. అక్కడ ఆసుపత్రిలో 108, 104 సేవలకు సంబంధించిన వాహనాలను పార్కింగ్ లో ఉంచుతారు. ఈ వాహనాల పార్కింగ్ మధ్య అప్పుడే పుట్టిన బిడ్డను అక్కడ పడవేసి వెళ్లిపోయారు. చనిపోయిన తరువాత అక్కడ పడవేశారా లేదా పడవేసిన తర్వాత ఆ పసికందు చనిపోయిందా అన్న వివరాలు ఇంకా తెలియరాలేదు. ప్రస్తుతానికి ఆసుపత్రి సిబ్బంది పసికందు మృతదేహాన్ని మార్చురిలో భద్రపరిచారు. పూర్తిస్థాయిలో నిఘా కెమెరాలతో ఉన్న సర్వజన ఆస్పత్రిలో ఈ పని చేసింది ఎవరు అని తెలుసుకోవడం చాలా సులువైన పని.