ప్రజాశక్తి-ఆగిరిపల్లి : ఆగిరిపల్లి మండల పరిధిలోని తాడేపల్లి చప్పట్లు మెట్ల గ్రామంలో గల కేకేఆర్ హ్యాపీ స్కూల్ నందు శనివారం ఉదయం 9 గంటల సమయంలో వాడి పడేసిన పెయింట్ డబ్బాల స్క్రాప్ ను గ్రేడింగ్ చేస్తున్న సమయంలో పేలుడు సంభవించి విజయవాడ ఆటోనగర్ కు చెందిన ప్రసాద్(48)కు తీవ్ర గాయాలు అయ్యి తీవ్ర రక్తస్రావంతో నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రిలో మృతి చెందారు. మరొక వ్యక్తి శాంతల మణి గాయాల పాలయ్యాడు నూజివీడు డిఎస్పి అశోక్ కుమార్ గౌడ్ సిఐ అంకబాబు ఎస్ఐ చంటిబాబు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు










