Feb 05,2023 21:41
  • ఉత్తరాఖండ్‌ ఉద్యోగ నియామకాల్లో కాషాయ పార్టీ అక్రమాలు

న్యూఢిల్లీ : ఉత్తరాఖండ్‌లో అవినీతి, కుంభకోణాలకు అడ్డుకట్ట పడటం లేదు. ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షల్లో అక్రమాలు, పేపర్‌ లీకేజ్‌లు అక్కడ సర్వసాధారణంగా మారాయి. సిఎం పుష్కర్‌సింగ్‌ ధామి నేతృత్వంలోనిబిజెపి ప్రభుత్వం మరో వివాదంలో చిక్కుకుంది. ఉత్తరాఖండ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నిర్వహించిన జూనియర్‌ ఇంజనీర్‌ (జెఇ), అసిస్టెంట్‌ ఇంజనీర్‌ (ఎఇ) పరీక్ష పేపర్‌ లీక్‌ కేసులో బిజెపి మండల్‌ ప్రెసిడెంట్‌ సంజరు ధరివాల్‌ ప్రధాన నిందితుడిగా కేసు నమోదైంది. అతనితోపాటు మరో 9మంది ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సంజయ్ ధరివాల్‌ మధ్యవర్తిగా వ్యవహరించాడని, ఈ కేసులో నిందితులుగా ఉన్న 9మంది వెనుక రూర్కీకి చెందిన మరో బిజెపి నాయకుడు ఉన్నాడని తెలిసింది.
ఈ కేసు వివరాలిు ఎస్‌ఎస్‌పి హరిద్వార్‌ అజరు సింగ్‌ మీడియాకుతెలుపుతూ, ''పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నిర్వహించిన జెఇ, ఎఇ పరీక్షల్లో ప్రశు ప్రతానిు లీక్‌ చేశారన్నది ముఖ్యమైన ఆరోపణ. ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) ముగ్గురు నిందితులు సంజీవ్‌కుమార్‌, నితిన్‌ చౌహాన్‌, సునీల్‌ సైనీలను అదుపులోకి తీసుకొనివిచారణ జరిపింది. పెద్ద మొత్తంలో నగదు ,వివిధ బ్యాంకుల ఖాళీ చెక్కులు వారి వద్ద ఉనాుయి. ఈ కేసులో బిజెపి నాయకుడు సంజయ్ ధరివాల్‌ పాత్రపై పోలీసులకు పలు అనుమానాలున్నాయి'' అనిఅనాురు. ఈ సంగతి మీడియాలో విడుదల కాగానే ధరివాల్‌ తన పార్టీ పదవికి రాజీనామా చేశారు.
పేపర్‌ లీకేజీ కేసు ఉత్తరాఖండ్‌లో రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఈ కుంభకోణంలో పోలీసులు మీడియాకువిడుదల చేసిన పేర్లు బిజెపికి చెందిన వారివే కావడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. పేపర్‌ లీకేజీతో సంబంధమును హకీం సింగ్‌ను అరెస్టు చేయాలనిరాష్ట్ర ప్రభుత్వానిు కాంగ్రెస్‌ డిమాండ్‌ చేస్తును తరుణంలో బిజెపి నాయకుడు సంజరు ధరివాల్‌ పేరు తెరపైకి వచ్చింది. ''ఈ కుంభకోణంలో బిజెపి నాయకుల పాత్రను తాజా పరిణామం బయటపెట్టింది. ఆ పార్టీ సీనియర్‌ నాయకులు ఈ పేపర్‌ లీకేజ్‌ కుంభకోణం వెనుక ఉనాురు'' అనికాంగ్రెస్‌ రాష్ట్ర అధికార ప్రతినిధి గరీమా మహారా డాసోనిఅనాురు. ఈ కేసులో ఇప్పటివరకూ 54 మంది నిందితులిు పోలీసులు అరెస్టు చేశారు.