ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : ఇప్పటికే ప్రయివేటీకరణపై అతి వేగంగా అడుగులు వేస్తున్న కేంద్ర ప్రభుత్వం ఈ విధానాలపై అధికారులకు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన కసరత్తును ప్రారంభించింది. ప్రబ్లిక్ ప్రయివేటు భాగస్వామ్యంతో పథకాల అమలుపై ప్రధానంగా ఈ శిక్షణ జరగనుందని సమాచారం. ప్రధానంగా ఎరపిక చేసిన నగరాలకు చెరదిన అధికారులకు ఈ శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు.కేంద్ర ఎకనామిక్ అఫైర్స్ (డిఇఏ) ఆధ్వర్యంలో ఈ శిక్షణ జరగనుంది. డిఇఏ అధ్వర్యంలోనే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ సెక్రటేరియట్ ఏర్పాటు చేశారు. ఈ విభాగం నేతృత్వంలోనే గుర్తిరచిన ప్రారతాల్లో మౌలిక సౌకర్యాల కల్పనకు తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పిస్తూనే వాటిని నేరుగా ప్రభుత్వం తరఫున కాకుండా ప్రయివేటు భాగస్వామ్యంతో నిర్వహించాలని సూచించనున్నారు. రాష్ట్రాల్లోని గ్రూప్-ఎ స్థాయి అధికారులకు ప్రత్యేకంగా ఈ శిక్షణ అందించనున్నారు. ఇరదులో భాగంగానే ప్రాజెక్టులకు సంబంధిరచి నాయకత్వ బాధ్యతలు, కాంట్రాక్ట్ మంతనాలు, నిర్వహణలో న్యాయ చిక్కులు రాకుండా చూడటం తదితర అంశాలను అజెండాలో చేర్చారు. ఇవన్నీ అధికారుల్లో నైపుణ్యాన్ని పెంచేందుకేనని చెబుతూనే పిపిపి విధానంపై ఫోకస్ పెట్టడం విశేషం.
- 31 నుంచి భేటీలు
ఈ శిక్షణ సమావేశాలను ఈ నెల 31 నుంచి బెరగళూరులో ప్రారంభించి తరువాత కోల్‌కతా, ఇండోర్, రాయ్ పూర్‌లలో నిర్వహించనున్నారు. ఆయా రంగాల్లో పాల్గొనే ప్రతినిధుల వివరాలను త్వరగా పంపించాలని కేంద్ర అధికారులు కోరారు. ఈ సమావేశాల్లో కేంద్రంలోని 24 శాఖల అధికారులు పాల్గొని అవగాహన కల్పించనున్నారు. రాష్ట్రాల నుంచి కూడా ప్రత్యేకంగా పిపిపి సెల్ అధికారులను కూడా ఆహ్వానిస్తున్నారు. వీరితో పాటు విశాఖపట్నం, నెల్లూరు, అనంతపురం, కాకినాడ, కర్నూలు, తిరుపతి, చిత్తూరు నగరపాలక సంస్థలను ఈ మౌలికాభివృద్ధికి గుర్తించడం విశేషం. ఆయా ప్రారతాల అభివృద్ధికోసం అధికారులను పంపించాలని కూడా సూచించింది.










