ప్రజాశక్తి - ఆలమూరు : మండలంలోని లంక గ్రామాల ముఖ్య కేంద్రమైన చెముడు లంక శ్రీకృష్ణదేవరాయ కాపు కళ్యాణ మండపంలో సొసైటీ డైరెక్టర్, వైసిపి సీనియర్ నేత అడబాల వీర్రాజు మనవడు చిరంజీవి అడబాల షణ్ముఖ్ ద్వితీయ పుట్టినరోజు వేడుకలు గురువారం కుటుంబ సభ్యులు ప్రముఖుల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైసిపి మండల కన్వీనర్, స్థానిక సర్పంచ్ తమ్మన శ్రీనివాస్, వైసిపి సీనియర్ నేతలు దొండపాటి చంటి, దొండపాటి వెంకట్రామయ్య, దొండపాటి శ్రీను, దొండపాటి వెంకటేశ్వరరావు(బులిరెడ్డి), బుడ్డిగ వీర వెంకటరావు, పాలూరి రాధాకృష్ణ, దొండపాటి శ్రీరాములు, అడబాల శ్రీను, పాలూరి వెంకటరమణ, నాగిరెడ్డి సత్యనారాయణ, మోటూరి సురేష్, రాయుడు వెంకటేష్, తమ్మన హరి బొర్రా వీరబాబు, పామర్తి ఆదినారాయణ, తదితరులు హాజరై ఆశీర్వదించారు.










