Apr 08,2023 16:59

ప్రజాశక్తి-చీరాల: పేదల అవసరాలను గుర్తించి వారి చేయూతను అందిస్తూ అన్నివేళలా అండగా ఉండేందుకే పద్మ భాస్కర్ ఫౌండేషన్ స్థాపించామని ఆ ఫౌండేషన్ చైర్మన్ ఘంటా అనీల్ అన్నారు. శనివారం పట్టణంలోని 31వ వార్డ్ రోశయ్య కాలనిలో పద్మ భాస్కర్ ఫౌండేషన్ అధ్వర్యంలో ఘంటా పద్మావతి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ చైర్మన్ గంట అనిల్ మాట్లాడుతూ పద్మ భాస్కర్ ఫౌండేషన్ తరపున ఎన్నో సేవాకార్యక్రమాలు చేస్తున్నామని, అన్ని దానాలలో అన్నదానం గొప్పదని పద్మ భాస్కర్ ఫౌండేషన్ చైర్మన్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఘంటా అనిల్ మాట్లాడుతూ  మేము చేస్తున్న సేవాకార్యక్రమాలు చూసి ఆకర్షితులై నన్నపనేని వెంకటసుబ్బరావు సతీమణి ఇందిరా దేవి స్వచ్ఛందంగా ముందుకువచ్చి సహాయం చేసారని అన్నారు. చీరాల ప్రాంతంలోని పేదలను గుర్తించి అన్నదానం నిర్వహించడం తనకు ఆత్మ సంతృప్తినిచ్చిందని, నాకు సహకరిస్తున్న మిత్రులకు శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలిపారు. సమాజంలో ప్రతి ఒక్కరూ పేదలకు తమ వంతు సాయాన్ని అందించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వలివేటి పూర్ణ చంద్ర రావు,ఘంటా కుసుమ కుమారి,31వ వార్డు కౌన్సిలర్ సల్లూరు సత్యానందం,రోశయ్య కాలనీ ప్రజలు పాల్గొన్నారు.