Oct 04,2023 16:01
  • సిఐ సోమశేఖర్ ను సన్మానించిన విద్యార్థులు 

ప్రజాశక్తి - చీరాల : విద్యార్థులు విధ్యేతర రంగాల్లో కూడా రాణించాలని ఒకటవ పట్టణ సీఐ సోమశేఖర్ అన్నారు. పట్టణంలో స్థానిక భారతి డిగ్రీ కళాశాల వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా బుధవారం ఆయనను సత్కరించారు. కళాశాల డైరెక్టర్ మన్నేపల్లి బ్రహ్మయ్య అధ్యక్షతన జరిగిన సభలో విద్యారంగంలోనే కాకుండా విద్యార్థుల రంగంలో కూడా రాణిస్తూ అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఉన్నత చదువులను విద్యార్థుల చదువుకొని మంచి ఉద్యోగాలు సంపాదించి తమకు తాముగా మంచి భవిష్యత్తును పొందే విధంగాచదువుపై దృష్టి సారించాలని అన్నారు.వార్షికోత్సవ సందర్భంగా విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. కార్యక్రమంలో డైరెక్టర్లు మేజర్ డాక్టర్ తోట రోశయ్య టి భూపేంద్ర ఏం బ్రహ్మయ్య ప్రిన్సిపాల్ యు జయశంకర్ ప్రసాద్ అధ్యాపకులు డాక్టర్ జై అనురాధ సంజీవ్ కుమార్, రమేష్,డి వెంకటేశ్వర్లు పలువురు హాజరయ్యారు. విద్యార్థులు నేడు పోటీ ప్రపంచంలో బ్రతకాలంటే సాంకేతిక పరిజ్ఞానం పై ప్రతిభావంతులుగా తయారవ్వాలి అన్నారు. అనంతరం విద్యార్థులు పలు సాంస్కృతిక నృత్యాలతో ప్రదర్శించారు.