ప్రజాశక్తి-బాపట్ల రూరల్ : బాపట్ల ఫోటోగ్రాఫర్‌కు అంతర్జాతీయ బంగారు పతకం లభించింది. వైల్డ్ లైఫ్ ఫొటోగ్రఫీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, ఢిల్లీ వారు, షట్టర్ బగ్స్ క్రియేటివ్ ఫోరమ్ యుఎఎ, విఎన్‌పిసియు ఎస్‌ఎ వారు సంయుక్తంగా నిర్వహించిన త్రీ కంట్రీ ఇంటర్నేషనల్ సర్క్యూట్ 2023లో బాపట్ల మండలం ముత్తాయపాలెం గ్రామానికి చెందిన ప్రముఖ ఫొటోగ్రాఫర్ పివిఎస్ నాగరాజుకు బంగారు పతకం సాధించారు. ఈ విషయాన్ని ఆయన బుధవారం విలేకరులకు చెప్పారు. మణికర్ణిక ఆర్ట్ గ్యాలరీ ఝాన్సీ ఉత్తరప్రదేశ్ వారు, డ్రీం పెయింట్ బ్రష్ కలకత్తా వెస్ట్ బెంగాల్ వారు జులై 2023లో నిర్వహించిన ఫొటోగ్రఫీ పోటీలలో రెండు బంగారు పతకాలు లభించాయన్నారు. నాగరాజుకు బాపట్ల ఫొటోగ్రాఫర్స్ అసోసియేషన్ సభ్యులు అభినందనలు తెలియజేశారు.










