ఆసియా కప్-2023 టోర్నీలో నిలబడాలంటే బంగ్లాదేశ్ ఈ మ్యాచ్‌లో తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌పై బంగ్లాదేశ్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్.. మెహిది హసన్ మీరజ్ (119 బంతుల్లో 112 - 7 ఫోర్లు, 3 సిక్సర్లు), నజ్ముల్ హసన్ షాంటో (105 బంతుల్లో 104 - 9 ఫోర్లు, సిక్సర్లు) సెంచరీలతో బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 334 పరుగుల భారీ స్కోర్ చేసింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బంగ్లాదేశ్‌కి ఓపెనర్లు శుభారంభం అందించారు. తొలి వికెట్‌కి 60 పరుగులు జోడించిన తర్వాత మహ్మద్ నయీం 32 బంతుల్లో 5 ఫోర్లతో 28 పరుగులు చేసి ముజీబ్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. తోహిద్ హృదరుని గుల్బాద్దీన్ డకౌట్ చేయడంతో 63 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది బంగ్లాదేశ్. మెహిదీ హసన్ మిరాజ్, నజ్ముల్ హుస్సేన్ షాంటో కలిసి మూడో వికెట్‌కి 215 పరుగుల భారీ భాగస్వామ్యం అందించారు. 119 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 112 పరుగులు చేసిన మెహిదీ హసన్ మిరాజ్... వన్డేల్లో రెండో సెంచరీ బాదాడు. సెంచరీ తర్వాత ముజీబ్ బౌలింగ్‌లో సిక్సర్ బాదిన మెహిదీ హసన్, ఎడమ చేతికి గాయం కావడంతో రిటైర్డ్ హార్ట్‌గా పెవిలియన్ చేరాడు. 105 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 104 పరుగులు చేసిన నజ్ముల్ హుస్సేన్ షాంటో కూడా వన్డేల్లో రెండో సెంచరీ నమోదు చేసుకున్నాడు.. సెంచరీ తర్వాత షాంటో రనౌట్ అయ్యాడు. 15 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 25 పరుగులు చేసిన ముస్తఫికర్ రహీం కూడా రనౌట్ కావడంతో వెంటవెంటనే 2 వికెట్లు కోల్పోయింది బంగ్లాదేశ్.. ఓ సిక్సర్‌తో 11 పరుగులు చేసిన షమీమ్ హుస్సేన్ కూడా రనౌట్ అయ్యాడు. అయితే మరో ఎండ్‌లో 18 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 32 పరుగులు చేసిన కెప్టెన్ షకీబ్ అల్ హసన్, బంగ్లా స్కోరు 330 దాటించాడు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో ముజీబ్, గుల్బాదిన్‌కు తలో వికెట్ దక్కింది.










