Dec 08,2020 10:19

విజ‌య‌వాడ బ్యూరో : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ రైతు వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తూ రైతు సంఘాలు ఇచ్చిన భారత్‌ బంద్‌ పిలుపులో భాగంగా విజయవాడలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో వామపక్ష పార్టీ, కాంగ్రెస్‌ పార్టీలు సహా రైతు, కౌలు రైతు, వ్యవసాయ కార్మిక సంఘాలు.. సిఐటియు, ఎఐటియుసి, ఐఎఫ్‌టియు, ఎస్‌యుసిఐసి, ఎప్‌ఎఫ్‌ఐ, డివైఎఫ్‌ఐ, ఎఐఎస్‌ఎఫ్‌ తదితర ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు. లెనిన్‌ సెంటర్‌ నుంచి ప్రారంభమైన ఈ ప్రదర్శన ఏలూరు రోడ్డు మీదుగా పోలీస్‌ కంట్రోల్‌ రూం వరకూ.. అక్కడి నుంచి బందరు రోడ్డు మీదుగా కృష్ణా జిల్లా గ్రంథాలయం వరకు కొనసాగనుంది. కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు, సిహెచ్‌బాబూరావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, జెల్లీ విల్సన్‌, రైతు సంఘం నాయకులు వడ్డే శోభనాద్రీశ్వరరావు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు వై.కేశవరావు, మర్రావు సూర్యనారాయణ, రైతు, కౌలు రైతు సంఘం నాయకులు పి.జమలయ్య, దడాల సుబ్బారావు, సిఐటియు నుంచి కె.ఉమామహేశ్వరరావు, ఐద్వా నుంచి డి.రమాదేవి, శ్రామిక మహిళా, అంగన్వాడీ, ఆశా నాయకులు కె.ధనలక్ష్మి, తదితరులు, కాంగ్రెస్‌ పార్టీ నుంచి నరహరిశెట్టి నరసింహారావు, ఆమ్‌ ఆద్మీ నుంచి పోతిన రామారావు, ప్రజానాట్యమండలి రాష్ట్ర కమిటీ నాయకులు అనిల్‌, ఎపి ప్రజానాట్య మండలి నుంచి చంద్రనాయక్‌, కెవిపిఎస్‌ నుంచి ఆండ్ర మాల్యాద్రి, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు ప్రసన్నకుమార్‌, డివైఎఫ్‌ఐ నాయకులు ఎం.సూర్యారావు, సిపిఐ ఎంఎల్‌ నుంచి జాస్తి కిశోర్‌ బాబు. పి.ప్రసాద్‌, సిపిఎం జిల్లా కమిటీ నాయకులు, నగర కమిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

బంద్‌కు మద్దతుగా విజయవాడలో భారీ ర్యాలీ..

 

బంద్‌కు మద్దతుగా విజయవాడలో భారీ ర్యాలీ..

 

బంద్‌కు మద్దతుగా విజయవాడలో భారీ ర్యాలీ..

 

బంద్‌కు మద్దతుగా విజయవాడలో భారీ ర్యాలీ..

 

బంద్‌కు మద్దతుగా విజయవాడలో భారీ ర్యాలీ..