Dec 24,2022 22:41
  • హర్యానా జింద్‌లో భారీ కిసాన్‌ మహాపంచాయత్‌
  • విద్యుత్‌ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్‌

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : జనవరి 26న దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ట్రాక్టర్‌ మార్చ్‌లు నిర్వహిస్తామని సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కెఎం) ప్రకటించింది. అదే రోజున హర్యానాలోని జింద్‌లో భారీ కిసాన్‌ మహాపంచాయత్‌ నిర్వహిస్తామని, అదే రోజు పార్లమెంట్‌ మార్చ్‌ తేదీని ప్రకటిస్తామని ఎస్‌కెఎం వెల్లడించింది. కరాుల్‌లోని గురుద్వారా డేరా కర్‌ సేవాలో ఎస్‌కెఎం జాతీయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎస్‌కెఎం నేతలు జోగీందర్‌ సింగ్‌ ఉగ్రహన్‌, విజూ కృష్ణన్‌, రావుల వెంకయ్య, సునీలం, రంజిత్‌ రాజు అధ్యక్షత వహించారు. ఎకెఎం నేతలు హనున్‌ మొల్లా, దర్శన్‌ పాల్‌, రాకేష్‌ తికాయత్‌, జోగిందర్‌ ఉగ్రహాన్‌, యుధ్వీర్‌ సింగ్‌ తదితరులు పాల్గనాురు. గణతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలకు ఆటంకం కలగకుండా జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం దేశంలోని అనిు జిల్లాల్లో ట్రాక్టర్‌ ర్యాలీలు, సమావేశాలు నిర్వహించాలని సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. జిల్లా కలెక్టర్లకు మెమోరాండం ఇవ్వనున్నారు.
జనవరి 26న హర్యానాలోని జింద్‌లో ఉత్తర భారత రాష్ట్రాల రైతుల భారీ కిసాన్‌ మహాపంచాయత్‌ నిర్వహించనునాురు. అదే రోజు మార్చి నెలలో నిర్వహించనును పార్లమెంట్‌ మార్చ్‌ (కిసాన్‌ ర్యాలీ) తేదీలను ప్రకటిస్తారు. గతంలో ఉపసంహరించుకుంటామని హామీ ఇచ్చిన విద్యుత్‌ చట్ట సవరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టి, బిజెపి ప్రభుత్వం రైతులకు ద్రోహం చేయడానిు ఎస్‌కెఎం ఖండించింది. హర్యానా బిజెపి ప్రభుత్వం రైతులపై తీసుకొచ్చిన గ్రామీణాభివృద్ధి సెస్‌లను ఉపసంహరించుకోవాలని సమావేశం డిమాండ్‌ చేసింది. రైతులపై అక్రమ కేసులను ఉపసంహరించుకోవాలని, పోలీసుల అణచివేతను ఉపసంహరించుకోవాలని ఎస్‌కెఎం సమావేశం డిమాండ్‌ చేసింది.

  • ఎంఎస్‌పికి చట్టపరమైన హామీ ఇవ్వాలి : ఎస్‌కెఎం నేతలు

ఎంఎస్‌పికి చట్టపరమైన హామీ ఇవ్వాలని ఎస్‌కెఎం నేతలు రాకేష్‌ తికాయత్‌, విజూ కృష్ణన్‌, ఉగ్రహాన్‌ డిమాండ్‌ చేశారు. ఎస్‌కెఎం సమావేశం అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. లఖింపూర్‌ ఖేరీలో రైతుల హత్యకు పాల్పడిన వారిపై త్వరితగతిన చర్యలు తీసుకోవాలని, అజయ్ మిశ్రా టెనీని మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు. ఇప్పటికైనా జైల్లో మగ్గుతును రైతులను విడుదల చేయాలనాురు. కిసాన్‌ ఉద్యమానికి మద్దతిచ్చిన పంజాబ్‌ గాయకులు కన్వర్‌ గ్రేవాల్‌, రంజిత్‌ బావాలపై కేంద్ర ఏజెన్సీలు, ఐటి శాఖ దాడులు చేయడానిు ఖండించారు. ఎస్‌కెఎం ఐక్యతను విచ్ఛినుం చేసేందుకు గత ఏడాది రిపబ్లిక్‌ డే రోజున బిజెపి ప్రభుత్వం చేసిన కుట్రను గుర్తు చేశారు. మహా పంచాయత్‌లో సమావేశమై భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తామనాురు. రైతుల సమస్యలను లేవనెత్తుతుందని తెలిపారు. భారత రాజ్యాంగం, ప్రజాస్వామ్యంపై దాడి చేస్తును ఫాసిస్ట్‌, మతతత్వ శక్తులకు వ్యతిరేకంగా మహాపంచాయత్‌ ఒక దృఢమైన సందేశానిు పంపుతుందని పేర్కొనాురు.

  • దేశవ్యాప్త రైతుల పోరాటాలకు సంఘీభావం

దేశవ్యాప్తంగా జరుగుతున్న రైతుల పోరాటాలకు ఎస్‌కెఎం సంఘీభావం తెలుపుతుందని చెప్పారు. ఐదు నెలలుగా మాల్బ్రోస్‌ ఇంటరుేషనల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ లిక్కర్‌ తయారీదారునికి వ్యతిరేకంగా రైతుల పోరాటానికి సమావేశం సంఘీభావం ప్రకటించిందనాురు. పందుల పెంపకందారులకు నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ రేవా నేతృత్వంలో 80 రోజులుగా జరుగుతును జరుగుతును పోరాటానికి మద్దతు ప్రకటించారు. పాకిస్తాన్‌ నుంచి వలస వచ్చి లతీఫ్‌పురా (జలంధర్‌)లో స్థిరపడిన 25కి పైగా కుటుంబాల ఇళ్లను పంజాబ్‌ ప్రభుత్వం కూల్చివేయడానిు ఎస్‌కెఎం ఖండించిందనాురు. ఎస్‌కెఎం తదుపరి జాతీయ సమావేశం 2023 ఫిబ్రవరి 9న కురుక్షేత్రలో జరగనుందని, అప్పుడు భవిష్యత్తు కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.