Oct 31,2023 17:07

మోడీ దగ్గర గ్రామ సింహలు, పిల్లులు అని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎం ఏ గఫూర్ రెండు పార్టీల పైన వ్యాంగస్త్రలు విసిరారు.  సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజా రక్షణ బేరి  మంగళవారం నంద్యాల పట్టణం లోకి ప్రవేశించింది. ఈ సందర్బంగా నంద్యాల పట్టణంలోని జి.వి మాల్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఎం ఏ గఫూర్ మాట్లాడుతూ  ప్రధాని మోడీ నాయకత్వం లోని కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అన్నదమ్ముల్లగా ఉండే ప్రజల మధ్య మత చిచ్చిపెట్టి లబ్ది పొందాలని చూస్తుందన్నారు. కేంద్రంలో మోడీ అధికారంలోకి వచ్చాక నిరుద్యోగం దారిద్రం పెరిగిపోయిందని, నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగిపోయాయన్నారు. ప్రతి ఒక్కరి వారి ఖాతాల్లో రూ.15 లక్షలు వేస్తామన్న మోడీ వాటి ని విస్మరించందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సమస్యల గురించి ఆలోచించడం లేదన్నారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం మతాల పేరుతో ప్రజల మధ్య తగదాలు సృష్టిస్తున్నారని ప్రజలు ఐక్యంగా ఉండటం మోడీకి ఇష్టం లేదని విమర్శించారు. వారు ఐక్యంగా ఉంటే తమ ఆటలు సాగవని అందుకే ప్రజల్లో మత చిచ్చు పెడుతున్నారన్నారు. రాష్టంలో జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు సీఎం సీటు కోసం కొట్లాడుతున్నారు తప్ప ప్రజా సంక్షేమం కోసం కాదని ఆయన ఆరోపించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్కీమ్ వర్కర్లకు సంక్షేమ పథకాలను వర్తింపజేయడం లేదని పదివేలతో స్కీం వర్కర్లు ఎలా బ్రతకగలరని ఆయన ప్రశ్నించారు. ముఖ్యమంత్రి  10 వేల రూపాయలతో ఒక నెల బతకగలరా అని ఆయన నిలదీశారు. కోటీశ్వరులకు సహాయం చేస్తూ పేద ప్రజలను అన్యాయం చేస్తున్నాడని ముఖ్యమంత్రి పై గఫూర్ మండిపడ్డారు. ముఖ్యమంత్రి ప్రజల సమస్యలపై ఆలోచించడం లేదని రాష్ట్రంలో ప్రజలు పార్టీల వారీగా విడిపోయారని తెలుగుదేశం వైసిపి పార్టీల వలన ప్రజలకు ఒరిగేది ఏం లేదన్నారు. నంద్యాల ప్రాంతము లో నీటి వనరులు ఉన్నప్పటికీ ప్రభుత్వాలు అసమర్థత వల్ల ఉపయోగించుకోలేకపోతున్నారన్నారు. కృష్ణా జలాలపై తమకు హక్కు లేదని కెసిఆర్ కు అనుకూలంగా మాట్లాడటం   తెలంగాణ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరంగా పెట్టారని ఆయన ఆరోపించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర విభజన సందర్భంగా హైదరాబాద్ ప్రభుత్వ భవనాల నుండి  500 కోట్ల పైన మనకు వాట రావాల్సి ఉండగా కెసిఆర్ కు ధరదాత్తం చేస్తున్నాడని విమర్శించారు.  ఇసుక, మద్యం అమ్మకల్లో వచ్చిన ఆదాయం ఎంత వైసిపి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పోతుందని, వైసిపి ప్రభుత్వం బందిపోట్ల ముఠాగా తయారైందని గఫూర్ ఘాటుగా స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం అప్పు 10 లక్షల కోట్లు  చేసిందని అందులో సంక్షేమానికి కేవలం 2.50 లక్షల కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని మిగిలిన సగం 7. 50 లక్షల కోట్లు ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు. దీనిపైన సిఐడి ఎందుకు విచారణ చేయడం లేదని గఫూర్ అన్నారు. రాష్ట్ర నాయకులు ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ప్రజలు రాష్ట్రంలో అనేక సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం శ్రద్ద చూపడం లేదన్నారు. విశాఖ ఉక్కు  పరిశ్రమను ప్రైవేట్ పరం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి ఏమి మాట్లాడడం లేదన్నారు. అంగన్వాడీలు కనీస వేతనాలు పెంచాలని కోరితే వారిని వేధింపులకు గురి చేస్తున్నారని, స్కీం వర్కర్ల సమస్యల పరిష్కరించడం లేదని, వారి హక్కులకై ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు. కార్మికుల హక్కులను పరిరక్షించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు  వైఫల్యం చెందాయన్నారు. మోడీ ప్రజా వ్యతిరేక విధానాలపైన సిపిఎం జిల్లా కార్యదర్శి టి. రమేష్ కుమార్ విరుచుకపడ్డారు. అంబాని, ఆదానిలకు ప్రధాని నరేంద్ర మోడీ దేశ సంపదను దోచిపెడుతున్నారని ఆరోపించారు. కేంద్రంలోని బిజెపి నాయకత్వంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం లో 9 సంవత్సరాల కాలంలో ఆత్మహత్యలు, నిరుద్యోగం, ధరలు పెరిగిపోయాయన్నారు. ఏడాదికి 2 కోట్లు ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నా మోడీ విస్మరించారన్నారు. సిపిఎం రాష్ట్ర నాయకులు దయా రమాదేవి మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రభుత్వంలో మహిళల పైన హత్యలు అత్యాచారాలు పెరిగిపోయాయని మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. బేటి బచావో బేటి పడావో అన్న నినాదం నరేంద్ర మోడీ ప్రభుత్వంలో ఆకర్షణీయంగా మారిందని ఆమె విమర్శించారు. అంగన్వాడి కార్యకర్తలు ఆశా వర్కర్లు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పట్టించుకోవడంలేదని విమర్శించారు. ఈ కార్యక్రమానికి  సిపిఎం పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు మహమ్మద్ గౌస్ అధ్యక్షత వహించగా సిపిఎం  కార్యదర్శివర్గ సభ్యులు కె.ప్రభాకరరెడ్డి, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఏ. నాగరాజు  పట్టణ నాయకులు టి.మద్దులు, డి లక్ష్మణ్, ఎస్.మస్తాన్ వలి, జిల్లా నాయకులు శివరాం, రత్నమయ్య శ్రీనివాసమూర్తి రామరాజు షేభారాణి తదితరులు పాల్గొన్నారు.ఆత్మకూరు నుండి బయలుదేరిన రక్షణ బస్సు యాత్ర కు నంద్యాల చెరువు కట్ట వద్ద సిపిఎం పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు.

 

నంద్యాల జిల్లాలో.. ప్రజా రక్షణ భేరి (లైవ్) 

సీపీఎం ప్రజా రక్షణ భేరి బస్సు యాత్ర నంద్యాల చేరుకుంది. చెరువు కట్ట వద్ద నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎం ఏ గఫూర్, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె. ప్రభాకర్ రెడ్డి, రాష్ట్ర నాయకులు ఉమామహేశ్వరావు, దయ రమాదేవి, శివ నాగరాణి నంద్యాల జిల్లా కార్యదర్శి టీ. రమేష్ కుమార్ పాల్గొన్నారు.