ప్రజాశక్తి-భట్టిప్రోలు : వేమూరు నియోజకవర్గం జంపని గ్రామ తెలుగుదేశం పార్టీ మరియు తెలుగు మహిళల ఆధ్వర్యంలో "బాబుతో నేను " కార్యక్రమం లో భాగంగా జంపని గ్రామం నుండి తెనాలి వైకుంఠపురంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం వరకు పాదయాత్ర నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా మహిళలు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు త్వరగా విడుదల అవ్వాలని, ఆరోగ్యం బాగుండాలని వెంకటేశ్వర స్వామికి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమం నకు వైకుంఠపురం దేవాలయం వద్ద మాజీ మంత్రి, పోలిట్ బ్యూరో సభ్యులు నక్కా. ఆనంద్ బాబు, వేమూరు మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ జొన్నలగడ్డ విజయబాబు, కొల్లూరు మాజీ ఎంపీపీ, తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి, కనగాల. మధుసూదన్ ప్రసాద్ తదితరులు సంఘీభావం తెలియచేసారు.










