విజయనగరం : రామతీర్థం ఘటన చాలా బాధాకరమని, దీని వెనుక ఉన్న దోషులను వెంటనే అదుపులోకి తీసుకొని శిక్షించాలని ఎపిసిసి అధ్యక్షులు సాకే శైలజానాథ్ పేర్కొన్నారు. బుధవారం ఆయన విజయనగరంలోని రామతీర్థం క్షేత్రాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రామతీర్థంలో సంఘటన పట్ల కాంగ్రెస్ నిరసన వ్యక్తం చేస్తుందన్నారు. మతాలకు అతీతంగా రాజకీయాలు ఉండాలని, ఉమ్మడి ఎపిలో ఏ రోజూ ఇలాంటి ఘటనలు జరగలేదని, ఒకవేళ జరిగినా వెంటనే చర్యలు తీసుకున్నారని తెలిపారు. మతాన్ని రాజకీయంగా తీసుకెళ్తే ఇలాంటి ఘటనలే జరుగుతాయని గుర్తు చేశారు. తిరుపతి ఎన్నికలో కూడా బిజెపి మాటలు గుర్తొస్తున్నాయని, బైబిల్ కావాలా?, భగవద్గీత కావాలా? అంటూ బిజెపి నాయకులు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. కేంద్రంలోనూ, రాష్టంలోనూ దొందుకు దొందు పాలన సాగిస్తున్నారని, అధికారంకో ఉండి కూడా నిందితులను పట్టుకోలేకపోతున్నారని అన్నారు. ఏదో ప్రయోజనము ఆశించే ఘటనను సాగదీస్తున్నారని విమర్శించారు.










