- న్యూ లైఫ్ పాఠశాల ఆధ్వర్యంలో జెండా ర్యాలీ
ప్రజాశక్తి-ఆనందపురం : 13 మండలంలోని గొట్టిపల్లి న్యూ లైఫ్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల ఆధ్వర్యంలో 75 అడుగుల జాతీయ జెండాతో విద్యార్థులు ఆనందపురం కూడలిలో ర్యాలీ నిర్వహించారు. ముందుగా ఆనందపురం కూడలిలో జాతీయ జెండాను పట్టుకుని ర్యాలీగా స్వతంత్ర భారత్ కి జై అంటూ నినాదాలు చేశారు. అనంతరం పాఠశాల విద్యార్థులు మమతా శ్రీ, ప్రసన్న జాతీయ గీతాన్ని ఆలపించారు. ఆనందపురం చాపల మార్కెట్ రోడ్డు నుండి కొత్త ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద నుండి బంటుపల్లి వారి కల్లాల వరకు ర్యాలీ నిర్వహించి స్వతంత్ర దినోత్సవం జాతీయ నాయకులు గురించి ప్లే కార్డులు పట్టుకొని భారత్ మాతాకీ జై అంటూ సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆనందపురం కూడలిలో పాఠశాల విద్యార్థులు దొంతల మమతా శ్రీ, ప్రసన్న దేశభక్తి గీతాలను ఆలపించారు. కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ శ్యామ్ మాథ్యూస్ మాట్లాడుతూ ఆజాద్ కా అమృత్ మహోత్సవాలలో భాగంగా పాఠశాల నుండి పలు కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. 76వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని దేశం కోసం త్యాగాలు చేసిన మేధావులను స్మరించుకోవడం అభినందనీయమన్నారు. ఎందరో మహానుభావుల త్యాగ ఫలితమే నేటి స్వతంత్ర దినోత్సవ వేడుకలకు నాంది అన్నారు. కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ శ్యామ్ మాథ్యూస్ తొ పాటు, ప్రిన్సిపాగ్ల్ జయ శ్యామ్, గ్రామీణ వైద్యుల సంఘం జిల్లా అధ్యక్షులు, న్యూ లైఫ్ పాఠశాల చిల్డ్రన్ టేకర్ జంగం జోష్, వైఎస్ఆర్సిపి జిల్లా ప్రధాన కార్యదర్శి, మాజీ సర్పంచ్ కోరాడ అప్పలస్వామి నాయుడు షార్ట్ ఫిలిం ఫోటోగ్రాఫర్ ఈశ్వర్ పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థి, విద్యార్థులు పాల్గొన్నారు.










