Oct 28,2022 16:48

ప్రజాశక్తి-తుగ్గలి : మండల కేంద్రమైన తుగ్గలి, పగిడిరాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఆయుర్వేద కేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వము ఏర్పాటు చేసింది. అయితే కొన్ని సంవత్సరాలుగా బాగా పనిచేస్తున్న ఆయుర్వేద ఆరోగ్య కేంద్రాలు ఉన్నట్టుండి జిల్లా అధికారులు ఎత్తివేయడం జరిగింది. దీంతో ఆయుర్వేద మందులకు అలవాటుపడ్డ రోగులు ఆందోళన చెందుతున్నారు. తుగ్గలి ఆయుర్వేద ఆరోగ్య కేంద్రంలో ఉన్న వైద్యాధికారి ఉమామహేశ్వర్ రెడ్డి ఎమ్మిగనూరు ఆయుర్వేద ఆరోగ్య కేంద్రానికి  బదిలీ కావడం జరిగింది. అక్కడున్న కాంపౌండర్   పదవి విరమణ పొందడంతో ఉన్న ఆసుపత్రి మూత పడింది. పగిడి రాయి  ఆయుర్వేద ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న వైద్యాధికారి లక్ష్మి అంతర్ జిల్లాల బదిలీలో భాగంగా వేరే జిల్లాకు బదిలీ కావడం జరిగింది. ఉన్న కాంపౌండర్ కూడా ఆదోనికి బదిలీ కావడం జరిగింది. దీంతో ఆసుపత్రి పూర్తిగా మూత పడింది. ఉన్న మందులు కూడా మాయమైనట్లు తెలుస్తోంది. తుగ్గలి మండలంలో రెండు ఆయుర్వేద ఆరోగ్య కేంద్రాలలో  వైద్యులు సిబ్బంది బదిలీ కావడంతో రెండు ఆసుపత్రిలో పూర్తిగా మూతపడ్డాయి. ఆయుర్వేద మందులపైన ఆధారపడ్డ రోగులు గుత్తి, గుంతకల్లు తదితర పట్టణాలకు పోయి  ఆయుర్వేద మందులు తెచ్చుకోవడం  జరుగుతుంది. ప్రస్తుత పరిస్థితులలో  ఇంగ్లీషు మందులు కన్నా ఆయుర్వేద మందులు పై మీద ఆధారపడ్డ రోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయుర్వేద వైద్యులను నియమించాలని పలుసార్లు అధికారులకు విన్నవించిన ఎవరు పట్టించుకోవడం లేదని ఆయా గ్రామాలకు చెందిన ప్రజలు అంటున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి తుగ్గలి పగిడిరాయిలలో ఆయుర్వేద ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేసి తగిన సిబ్బందిని నియమించాలని కోరుతున్నారు.

  • ఆయుర్వేద ఆరోగ్య కేంద్రాన్ని ఎత్తివేయడం దారుణం : నబి రసూల్

 మండల కేంద్రమైన తుగ్గలి పగిడిరాయి ఉన్న ఆయుర్వేద ఆరోగ్య కేంద్రాలను ఎత్తివేయడం మరియు దారుణమని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆయుర్వేద మీద ఆధారపడిన ప్రజలు  ఉంటే ఈ కేంద్రాలను ఎలా ఎత్తివేస్తారని ఆయన అధికారులను ప్రశ్నించారు. ఇప్పటికైనా ఆరోగ్య కేంద్రంలో తక్షణమే  ప్రారంభించాలని ఆయన జిల్లా కలెక్టర్ ను కోరారు..

  • ఉన్న కేంద్రాలు ఎత్తివేస్తే ఎలా.. : సిపిఎం మండల కార్యదర్శి శ్రీరాములు

 ప్రస్తుతం ఇంగ్లీషు మందులపై తగ్గుతున్న తరుణంలో  ఉన్న రెండు ఆయుర్వేద ఆరోగ్య కేంద్రాలను ఎత్తివేయడం అత్యంత బాధాకర విషయం అన్నారు. దానిమీద ఆధారపడ్డ రోగుల పరిస్థితి ఏమిటన్నారు. వారికి కేంద్రాలు ప్రారంభించక పోతే  ఆందోళన చేస్తామని ఆయన అధికారులకు తెలియజేశారు.