Jun 11,2023 16:58

ప్రజాశక్తి-కర్నూలు కలెక్టరేట్ : విభజన హామీలను తుంగలో తొక్కి రాష్ట్రంలో ఉన్న విశాఖ ఉక్కు పరిశ్రమను అమ్మడానికి పూనుకున్న హోం మంత్రి అమిత్ షా గో బ్యాక్ అంటూవామపక్షాలు పిలుపునిచ్చాయి. ఆదివారం విశాఖ నగరంలో జరుగు బహిరంగ సభలో పాల్గొనడానికి వస్తున్న కేంద్ర హోం శాఖ మాత్యులు అమి త్ షా  (మా రాష్ట్రానికి రావద్దు) గో బ్యాక్ అను నినాదంతో వాపక్ష పార్టీల ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు గాంధీ విగ్రహం దగ్గర నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ సందర్భంగా సి.పి.ఎం ఓల్డ్ సిటీ కార్యదర్శి ఎం.రాజశేఖర్ అధ్యక్షతన జరిగినసభలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పి.ఎస్.రాధాకృష్ణ, సి.పి.ఐ నగర సహాయ కార్యదర్శి డి.శ్రీనివాసరావు,సి.పి.ఐ (ఎం.ఎల్) జిల్లా నాయకులు నరసింహులు, వెంకటేశులు మాట్లాడుతూ కేంద్రంలో మోడీ (బిజెపి) ప్రభుత్వం అది అధికారం చేప ట్టి తొమ్మిది సంవత్సరములు పూర్తి చేసుకున్నది. అధికారంలోకి రాకముందు కొత్తగా ఏర్పాటు అయ్యే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా 10 కాదు 15 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామని, వెనుకబడిన ఏడు జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని,విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని, కడపలో స్టీల్ ప్లాంట్ నిర్మాణం చేపడతా మని వీటితోపాటు వైద్య విద్య ఉన్నత సంస్థలు ఏర్పాటు చేస్తా మని వాగ్దానం చేశారు.ఈ  వా గ్దానాలలో ఏ ఒక్కటి అమలు చేయకపోగా, పోలవరం ప్రాజె క్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తిం చి దానిని పూర్తి చేయడానికి త గిన నిధులు ఇవ్వకుండా ఇబ్బం దులు పెడుతూ మరోపక్క వి శాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు  అను నినాదంతో 33 మంది ప్రాణత్యాగాలతో వందమంది పైబ డి ప్రజాప్రతినిధుల రాజీనామా లతో సాధించుకున్న విశాఖ ఉ క్కు పరిశ్రమను అమ్మడానికి పూనుకున్నది. ఈ పరిశ్రమ ప్రత్యక్షంగా పరోక్షంగా లక్ష కుటుంబాలకు ఉపాధి కల్పిస్తున్నది. దాదాపు రెండు లక్షల కోట్ల పైబడి విలువ గలిగిన ఈ పరిశ్రమను కారు చౌక గా తన అన్యాయులైన కార్పొరే ట్ శక్తులకు కట్టబెట్టడం దుర్మా ర్గమైన చర్య. పరిశ్రమ ప్రైవేటు కంటే వ్యతిరేకంగా రాజకీయ పార్టీలు కార్మిక సంఘాలు ఇతర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పరిశ్రమ పరిరక్షణ కమిటీ ఏర్పడి దాదాపు 800 రోజులుగా ఆం దోళన చేస్తున్న ఏమాత్రం పట్టించుకోని కేంద్ర పాలకులు ఏ ముఖం పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ కు వస్తున్నారో అర్థం కావడం లేదు. ఏ ఒక్క విభజన హామీలను అమలు చేయకుండా, ఉన్న ఒక్క భారీ పరిశ్రమను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టాలనుకున్న పాల కులకు (ప్రధానమంత్రి మరియు మంత్రులు) ఆంధ్రప్రదేశ్లో పర్య టించే నైతిక హక్కు లేదు.అం దు భాగంగా విశాఖపట్నంలో జరుగు తున్న బహిరంగ సభలో పాల్గొనడానికి వస్తున్న హోంశాఖ మంత్రి అమిత్ షాకు గో బ్యాక్ (మా రాష్ట్రం నుంచి వెనక్కి వెళ్ళిపో) నినాదంతో రాష్ట్ర వ్యా ప్తంగా నిరసన కార్యక్రమాలను చేస్తున్నాము. ఇటువంటి ఆందోళనలు విభజన హామీలను అమలు చేసేంతవరకు విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటు కాండను ఉపసంహరించుకునేంత వరకు చేస్తూనే ఉంటాము. వామపక్షాలు ప్రజాసంఘాలు చేసే పోరాటాలకు ప్రజలందరూ సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమం సి.పి.ఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కే.వీ నారాయణ, సి.పి.ఎం నగర కార్యదర్శి టి.రాముడు, సిపిఐ నగర నాయకులు నాగరాజు, ఈశ్వర్, సి.పి.ఎం నగర నాయకులు విజయ్, సాయిబాబా, సుధాకరప్ప, అబ్దుల్ దేశాయ్, శరీష్, యేసు, రమిజాభీ, మరియు కార్మిక, ప్రజాసంఘల నాయకులు తదితరులు పాల్గొన్నారు.