Jan 27,2023 16:15

ప్రజాశక్తి-ఏలూరు (టీ నర్సాపురం) : టీ నర్సాపురం మండలం మల్లప్పగూడెం గ్రామంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం మండల కమిటీ సమావేశం ముఖ్య కార్యకర్తల సమావేశం మండల కార్యదర్శి మడకం సుధారాణి  అధ్యక్షన జిల్లా కార్యదర్శి పిల్లి రామకృష్ణ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం గిరిజన సంఘం, రైతు సంఘం ఆధ్వర్యంలో ఫిబ్రవరి 8వ తేదీ 10 గంటలకు టి నర్సాపురం మండలం 100 రామన్నపాలెం గ్రామంలో ఎర్ర కాలువ మిగులు భూములు పామాయిల్ తోటలో జిల్లా సదస్సు జరుగును. జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆదివాసులు, దళితులు, భూమిలో సాగులో ఉన్న పేదలు భూమికోసం ఉద్యమాలు పోరాటాలు చేస్తున్న వారు జిల్లా సదస్సుకు వచ్చి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఎర్రకాలువ ఎర్ర కాలువ రిజర్వాయర్ మిగుల భూములు జంగారెడ్డిగూడెం, టీ నర్సాపురం మండలాలలో 1500 ఎకరాలు మిగులు భూములు పేదలకు  ఎటువంటి ఆటంకాలు ఇబ్బందులు లేకుండా సాగుకు ఇవ్వాలని ఆదివాసులు హక్కులు కాపాడి పోడు భూములకు పట్టాలు ఇవ్వాలి, ద్వాసపాడు ఇతర చోట్ల అసైన్మెంట్ భూము లను దళితులకు పొజిషన్ కల్పించి పట్టాలు ఇవ్వాలని వి ఎస్ ఎస్ కటింగ్ ఆర్డర్లు లు ఇవ్వాలని వ్యవసాయ కూలీలకు కూలి పెంచాలి ఉపాధి కల్పించాలి ప్రభుత్వం తెలియజేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి తుమ్మల సత్యనారాయణ ,అనుమెలు మురళి పుసం చిన్న సూర్యరావు, సరీయం దుర్గమ్మ తదితరులు పాల్గొన్నారు