Apr 19,2023 13:32

ప్రజాశక్తి-అద్దంకి : రైతులు సేంద్రియ పద్ధతిలో పంటలను సాగు చేస్తే మంచి దిగుబడులతోపాటు ఆర్థిక లాభం చేకూరుతుందని ఒడిస్సాలోని పార్ల కిమిడికి చెందిన సెంచూరియన్ యూనివర్సిటీ విద్యార్థిని తాటి చైతన్య తెలిపారు. ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి విద్యార్థిని మాట్లాడుతూ తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు చేకూరే విధంగా సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేసినట్లయితే మంచి దిగుబడితోపాటు, మేలు రకమైన పంట నాణ్యత ఉంటుందన్నారు. రసాయనిక ఎరువులు వాడడం కన్నా సహజ సిద్ధమైన సేంద్రియ పద్ధతిలో పంట సాగు చేసినట్లయితే నాణ్యమైన పంట మన చేతికి అందుతుందన్నారు. జీవామృతం తయారుచేసి పంటలకు పిచికారి చేయాలన్నారు. రసాయనిక ఎరువులు పూర్తిగా తగ్గించాలన్నారు. ఈ రసాయనిక ఎరువుల వలన భూమిలో అనేక మార్పులు సంభవించి పంట దిగుబడి తక్కువ వస్తుందన్నారు. నియోజకవర్గంలో పలు గ్రామాలలో రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.