ప్రజాశక్తి-గణపవరం : బాల్య వివాహాలపై ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలని విజయవాడ సిద్ధార్థ కళాశాల గైనకాలజి ఎం సబిత అన్నారు. శుక్రవారం స్థానిక డిగ్రీ కాలేజీలో విద్యార్థినీ విద్యార్థులకు బాల్య వివాహాలపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సదస్సుకి కాలేజీ ప్రిన్సిపాల్ పి నిర్మల కుమారి అధ్యక్ష వహించారు. సదస్సులో సబిత మాట్లాడుతూ బాల్యవివాహలవలన జరిగే అనర్ధాలు గురించి విద్యార్థులకు వివరించారు. విద్యార్థులకు ముందు చదువు ఆ తర్వాత ఆర్థికంగా సంపాదన శారీరిక సామాజికంగా అన్ని విషయాల్లో తెలుసుకున్న తర్వాత వివాహం చేసుకోవడం మంచిది అని అన్నారు. అనంతరం డాక్టర్ సబితకు కాలేజీ సిబ్బంది ఘనంగా సన్మానం నిర్వహించారు. అలాగే కాలేజీలో ప్రధమ సంవత్సరం పూర్తయిన విద్యార్థిని విద్యార్థులకు నిర్వహిస్తున్న స్టూడెంట్ ఇండక్షన్ ప్రోగ్రాం 21వ రోజు ఘనంగా నిర్వహించారు. 21 రోజుల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతులు చేశారు ఈ కార్యక్రమంలో కాలేజీ లెక్చరర్లు సిబ్బంది పాల్గొన్నారు.










