ప్రజాశక్తి-గణపవరం : గణపవరం మండలం పీఎంపీ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా ఎయిడ్స్ పై అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ ఆర్ రోహిత్ మాట్లాడుతూ ఎయిడ్స్ మహమ్మారిని పారదోలెందుకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. సిహెచ్ఓ జీ.వల్సన్ బాబు మాట్లాడుతూ ఎయిడ్స్ పై తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో గణపవరం మండలం పిఎంపి అసోసియేషన్ అధ్యక్షులు ఏం సత్యనారాయణమూర్తి, జిల్లా అధ్యక్షులు ఏ ఆర్ కే పరమేశ్వరులు, విఎస్ శ్రీనివాసరావు, సిహెచ్ఎస్ ప్రభాకరరావు, పానకాలు తదితరులు పాల్గొన్నారు.










