30 ఓవర్లు పూర్తయ్యే సరికి టీమిండియా 3 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 81, కోహ్లీ 54, సుందర్ 18 పరుగులు చేసి ఔటవ్వగా.. కేఎల్ రాహుల్ 8, శ్రేయాస్ 30 పరుగుల మీద బ్యాటింగ్ చేస్తున్నారు.
- కోహ్లీ ఔట్.. మ్యాక్స్‌వెల్‌కు 3వ వికెట్
ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ మ్యాక్స్‌వెల్ బ్యాటింగ్‌లో రాణించనప్పటికి బౌలింగ్‌లో 3 వికెట్లు తీశాడు. తొలుత ఓపెనర్లను రోహిత్, సుందర్‌లను ఔట్ చేసిన మ్యాక్సి.. 56 పరుగులు చేసి జోరుమీద ఉన్న విరాట్‌ను పెవిలియన్‌కు పంంపాడు. ప్రస్తుతం టీమిండియా 27 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. క్రీజులోకి కేఎల్ రాహుల్ వచ్చాడు. శ్రేయాస్ 15 పరుగుల మీద బ్యాటింగ్ చేస్తున్నాడు.
- కోహ్లీ 50.. టీమిండియా 168/2
వన్‌డౌన్‌లో వచ్చిన విరాట్ కోహ్లీ హఫ్‌సెంచరి సాధించారు. కోహ్లీ 57 బంతుల్లో 54 పరగులు చేశాడు. ఈ క్రమంలో విరాట్‌కు వన్డేల్లో 66వ అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. మరోవైపు శ్రేయస్ 13 బంతుల్లో 14 పరుగుల మీద బ్యాటింగ్ చేస్తున్నాడు.
- రెండో వికెట్ డౌన్.. టీమిండియా 153/2
81 పరుగులు చేసిన రోహిత్ శర్మ మ్యాక్స్‌వెల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.23 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 153/2గా ఉంది. విరాట్ కోహ్లి (46), శ్రేయస్ అయ్యర్ (6) క్రీజ్‌లో ఉన్నారు.
- సుందర్ ఔట్.. టీమిండియా 74/1
30 బంతుల్లో 18 పరగులు చేసిన వాషింగ్టన్ సుందర్ మ్యాక్స్‌వెల్ బౌలింగ్‌లో లంబుషేన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. క్రీజులో రోహిత్ శర్మ 55, కోహ్లీ ఉన్నారు. టీమిండియా ప్రస్తుతం వికెట్ నష్టానికి 74 పరుగులు చేసింది.
- రోహిత్ 50.. టీమిండియా 72/0
టీమిండియా ఓపెనర్ కెప్టెన్ రోహిత్ శర్మ ధాటిగా ఆడుతున్నాడు. 31 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 50 పరుగులతో అజేయంగా నిలిచాడు. సుందర్ నిదానంగా ఆడుతూ.. రోహిత్‌కి మంచి సపోర్ట్ ఇస్తున్నాడు. సుందర్ 26 బంతుల్లో 17 పరుగులు చేశాడు. 10 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 72/0గా ఉంది.
- ప్రారంభమైన భారత ఇన్నింగ్స్
మూడో వన్డేలో భారత్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. ఓపెనర్ రోహిత్ శర్మకు జోడిగా వాషింగ్టన్ సుందర్ వచ్చాడు. ప్రస్తుతం 5 ఓవర్లు ముగిసే సరికి రోహిత్ 20 బంతుల్లో 34 (3 ఫోర్లు, 3 సిక్స్‌లు), సుందర్ 16 బంతుల్లో 9 పరుగులు చేశారు.
- మూడో వన్డేలో భారత్ లక్ష్యం 353
రాజ్‌కోట్‌లో జరుగుతున్న ఆఖరి వన్డేలో ఆస్ట్రేలియా భారీ స్కోరు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా, నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 352 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆస్ట్రేలియాకి ఓపెనర్లు శుభారంభం అందించారు. భారత్ ముందు 353 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఆటగాళ్లు దాటిగా ఆడారు. తొలు ఓపెనర్లు వార్నర్ 34 బంతుల్లో 56, మార్ష్ 84 బంతుల్లో 96 పరుగులు చేయగా స్మిత్ 61 బంతుల్లో 74 చేయగా చివర్లో లంబుషేన్ 58 బంతులో 72 పరుగులు చేశాడు. మ్యాక్స్‌వెల్ 5, అలెక్స్ క్యారీ 11, గ్రీన్ 9 పరుగులతో నిరాశపరిచారు. ప్యాట్‌కమిన్స్ 19, స్టార్క్ 1 పరుగుతో నాటౌట్‌గా నిలిచారు. భారత బౌలర్లలో బుమ్రా 3, కుల్‌దీప్ 2, సిరాజ్, ప్రసిద్ కృష్ట తలో వికెట్ తీసుకున్నారు.
- లబూషేన్ ఔట్.. ఆసీస్ 345/7
58 బంతుల్లో 72 పరుగులు చేసిన లబూషేన్ బుమ్రా బౌలింగ్‌లో శ్రేయస్ అయ్యార్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. లబూషేన్ ఇన్నింగ్స్‌లో 9 పోర్లు ఉన్నాయి. క్రీజులోకి మిచెల్ స్టార్క్ వచ్చాడు. ప్యాట్ కమిన్స్ 19 పరుగులు మీద బ్యాటింగ్ చేస్తున్నాడు. ఆసీస్ ప్రస్తుతం 49 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 245 పరుగులు చేసింది.
- గ్రీన్ ఔట్.. ఆసీస్ 299/6
కుల్‌దిప్ యాదవ్ బౌలింగ్ కామెరూన్ గ్రీన్ భారీ షాట్‌కు ప్రయత్నించి శ్రయస్ అయ్యర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ప్రస్తుతం ఆసీస్ 6 వికెట్ల నష్టానికి 299 పరుగులు చేసింది. క్రీజులో లబూషేన్ 42, ప్యాట్ కమిన్స్ ఉన్నారు.
- మ్యాక్స్‌వెల్ బౌల్డ్.. ఆసీస్ 281/5
జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో మ్యాక్స్‌వెల్ (5) క్లీన్ బౌల్డయ్యాడు. 39 ఓవర్ల తర్వాత ఆసీస్ స్కోర్ 281/5. లబూషేన్ (33), గ్రీన్ క్రీజ్‌లో ఉన్నారు.
- నాలుగో వికెట్ కోల్పోయిన ఆసీస్
267 పరుగుల వద్ద ఆసీస్ నాలుగో వికెట్ కోల్పోయింది. బుమ్రా బౌలింగ్‌లో కోహ్లికి క్యాచ్ ఇచ్చి అలెక్స్ క్యారీ (11) ఔటయ్యాడు. లబూషేన్ (26), మ్యాక్స్‌వెల్ క్రీజ్‌లో ఉన్నారు.
- స్మిత్ ఔట్ .. ఆసీస్ 242/3
మహ్మద్ సిరాజ్ బౌలింగ్ స్టీవ్ స్మిత్ ఎల్బీగా పెవిలియన్‌కు చేరాడు. 61 బంతుల్లో 74 పరుగులు చేశాడు. ఆతని ఇన్నింగ్‌లో 8 పోర్లు, 1 సిక్స్ ఉంది. ఆసీస్ 31 ఒవర్లకు 242 పరగులు చేసింది. క్రీజులోకి అలెక్స్ క్యారీ వచ్చాడు. లబూషేన్ 10 బంతుల్లో 14 పరగులపై బ్యాటింగ్ చేస్తున్నాడు.
- మార్ష్ సెంచరీ మిస్
84 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 96 పరుగులు చేసిన మార్ష్ కుల్దీప్ బౌలింగ్‌లో ప్రసిద్ద్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో 4 పరుగుల తేడాతో సెంచరీ మిస్ చేసుకున్నాడు. 28 ఓవర్ల తర్వాత ఆసీస్ స్కోర్ 215/2. స్మిత్ (61), లబూషేన్ క్రీజ్లో ఉన్నారు.
- 25 ఓవర్లు పూర్తి... స్మిత్ 50.. ఆసీస్-188/1
25 ఓవర్లు ముగిసే సరికి ఆసీస్ 188 పరుగులు చేసింది. ఈ క్రమంలో స్టీవ్‌స్మిత్ హాప్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 44 బంతుల్లో స్మిత్ 5 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 50 పరగులు మార్క్‌ను అందుకున్నాడు. మరో పక్క మార్ష్ ఆకాశమే హద్దుగా ఆడుతున్నాడు. 72 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్స్ సాయంతో 78 పరుగులు చేశాడు.
- 20 ఓవర్లకు ఆసీస్ -146/1
20 ఓవర్లు ముగిసే సరికి ఆసీస్ 146 పరుగులు చేసింది. ఓపెనర్ మిచెల్ మార్ష్ 55 బంతుల్లో 53 పరగులు చేయగా, స్టీవ్ స్మిత్ 33 బంతులో 36 పరుగులు చేశాడు.
- మిచెల్ మార్ష్ 50
ఆసీస్‌కు ఓపెనర్ మిచెల్ మార్ష్ 45 బంతుల్లో 50 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, 1 సిక్స్ ఉన్నాయి. ప్రస్తుతం 17 ఓవర్లకు ఆసీస్ 135 పరుగులు చేసింది. స్టీవ్ స్మిత్ 23 బంతులో 23 పరుగులు చేశాడు.
- వార్నర్ ఔట్.. ఆసీస్ స్కోర్ 84/1
డేవిడ్ వార్నర్ (34 బంతుల్లో 56- 6 ఫోర్లు, 4 సిక్సర్లు)మెరుపు ఇన్నింగ్స్ ఆడిన అనంతరం ప్రసిద్ద్ కష్ణ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 9 ఓవర్ల తర్వాత ఆసీస్ స్కోర్ 84/1. మిచెల్ మార్ష్ (22), స్టీవ్ స్మిత్ (6) క్రీజ్‌లో ఉన్నారు.
- టాస్ గెలిచిన ఆసీస్.. తొలుత బ్యాటింగ్
రాజ్‌కోట్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న నామమాత్రపు మూడో వన్డేలో ఆస్ట్రేలియా ధాటిగా ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్‌కు ఓపెనర్లు వార్నర్, మిచెల్ మార్ష్ క్రీజులోకి వచ్చారు.
టీమిండియా: రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కష్ణ
ఆస్ట్రేలియా: మిచెల్ మార్ష్, డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్, అలెక్స్ క్యారీ, గ్లెన్ మ్యాక్స్‌వెల్, కామెరూన్ గ్రీన్, ప్యాట్ కమిన్స్(కెప్టెన్), మిచెల్ స్టార్క్, తన్వీర్ సింగ్, జోష్ హేజిల్‌వుడ్.










